CASTING CALL ALERT from Hanuman Producers for their next big project: చాలా మందికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉంటుంది. కానీ ఎవరిని, ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియక చాలా మంది వెనకడుగు వేస్తూంటారు. ఇక కొంత మంది ముందడుగు వేసినా… అంత ఈజీగా అవకాశాలు రావు. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగే వాళ్లు ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే మేం బంపర్ ఆఫర్ మీ ముందుకు తీసుకువచ్చాం. మీకు యాక్టింగ్ మీద విపరీతంగా ఆసక్తి ఉందా.. అయితే ఈ వార్త మీకోసమే… సినిమాల్లో నటించాలనుకునే వారికి అద్భుత అవకాశం కల్పిస్తున్నారు హనుమాన్ మేకర్స్. ఈ ఏడాది హనుమాన్ సినిమాతో ఆ చిత్ర నిర్మాత కే. నిరంజన్ రెడ్డి భారీ లాభాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద హనుమాన్ చిత్రాన్ని నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
Teja Sajja: హను-మాన్ తరువాత తేజ సజ్జా సినిమా ఇదే.. రేపే అధికారిక ప్రకటన!
ఇప్పుడు హనుమాన్ మేకర్స్ మరో బిగ్ ప్రాజెక్ట్ కోసం.. కొత్త వారికి అవకాశాలు కల్పించేందుకు పూనుకుంది. క్యాస్టింగ్ కాల్ పేరిట ఓ ప్రకటన చేశారు. నటన మీద ఆసక్తి ఉండే అన్ని వయసు వారికి తమ ప్రాజెక్టులో నటించేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇక ఈ సినిమాలో నటించేందుకు మీరు చేయాల్సింది.. ఏంటంటే.. ఒక్క నిమిషం నిడివితో కూడిన యాక్టింగ్ వీడియోను పంపించాలి. అంతే కాదు.. దానికి మీ పూర్తి వివరాలు పంపించాలి. ఇక ముఖ్యంగా రాయలసీమ యాసలో మంచి బాడీ కలిగిన మగవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంకేందుకు ఆలస్యం… మీకు నటనపరంగా ఆసక్తి ఉంటే… PRIMESHOWCASTING@GMAIL.COM కి మెయిల్ చేయండి. వాట్సాప్ నంబర్ 9989654997కి వీడియోలు పంపండి. అయితే ఏప్రిల్ 25వ తేదీలోపు మీ వివరాలు పంపవలసి ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని… మీ లక్ష్యాన్ని చేరుకోండి.
CASTING CALL ALERT for our next big project💥
We are Looking for talents across all age groups who can speak the Rayalaseema dialect ❤️🔥
Send in your portfolio to ✉️ primeshowcasting@gmail.com or WhatsApp to +91 9989654997 🎬
NOTE: DEADLINE APRIL 25th 🚨 pic.twitter.com/H8qiFTinKT
— Primeshow Entertainment (@Primeshowtweets) April 12, 2024