Site icon NTV Telugu

Elvish Yadav: మళ్ళీ చిక్కుల్లో బిగ్ బాస్ విన్నర్.. కేసు నమోదు

Elvish Yadav

Elvish Yadav

Case Registered Against Elvish Yadav And Rahul Fazil Puria: బిగ్ బాస్ OTT సీజన్ టూ విజేత ఎల్విష్ యాదవ్ మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. 32 బోర్ అనే సాంగ్ షూటింగ్ సమయంలో ఇతర దేశాల పాములను అక్రమంగా వాడినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు ఎల్విష్ యాదవ్, గాయకుడు రాహుల్ యాదవ్ అలియాస్ ఫజిల్‌పురియాపై బాద్షాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారు సౌరభ్ గుప్తా పిటిషన్‌ను విచారిస్తున్న ఏసీజేఎం కోర్టు మనోజ్ కుమార్ రాణా ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం, గురుగ్రామ్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మనోజ్ రాణా కోర్టు, ఒక పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని, రాహుల్ యాదవ్ ఫాజిల్‌పురియా మరియు ఎల్విష్ యాదవ్‌లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. పీపుల్ ఫర్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థ తరపున దర్శకుడు సౌరభ్ గుప్తా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పాట చిత్రీకరణలో అరుదైన జాతి పాములను అక్రమంగా ఉపయోగించారని, వాటిని మెడలో వేసిడాన్సులు చేశారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Snigdha: ఎప్పుడూ మనమే ఉండాలనుకుంటే ఎలా? మణిశర్మకి స్నిగ్ధ కౌంటర్?

ఎల్విష్ యాదవ్ – సింగర్ రాహుల్ యాదవ్ ఫాజిల్‌పురియా పాడిన 32 బోర్ పాట కొన్ని నెలల క్రితం విడుదలైంది. ఇందులో ఇద్దరూ మెడలో పాములతో వీడియోలో కనిపించారు. దీనిపై పీపుల్స్ ఫర్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థ తరపున సౌరభ్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవి అరుదైన పాములు, జీవులని ఆయన ఆరోపించారు. అలాంటప్పుడు ఇలా మెడలో వేసుకుని వీడియో తీస్తే ఎలా? వాటిని ఉంచడానికి అనుమతి లేదని అన్నారు. అయితే పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం కోర్టు బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆదేశించింది. 32 బార్ పాట చిత్రీకరణలో అక్రమంగా పాములను వాడినందుకు, అసభ్య పదజాలంతో మాట్లాడినందుకు ఎల్విస్ యాదవ్ – గాయకుడు ఫాజిల్‌పురియాలను శిక్షించాలని ఫిర్యాదుదారుడి పిటిషన్‌పై, సిఆర్‌పిసిలోని సెక్షన్ 156 (3) ప్రకారం గురుగ్రామ్ కోర్టులోని ఎసిజెఎం మనోజ్ కుమార్ రాణా ఆదేశం. దీంతో వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 294, వన్యప్రాణుల పట్ల క్రూరత్వం కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version