Site icon NTV Telugu

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో శంకర్ అల్లుడు

Case Filed Against Shankar's Son-in-law In A Minor Girl Sexual Harassment Case

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ దర్శకుడు శంకర్ అల్లుడు రోహిత్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదయింది. రోహిత్ దామోదరన్ ఒక క్రికెటర్. 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించి తమిళనాడులోని మెట్టుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద నమోదు చేశారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ సిచెమ్ మదురై పాంథర్స్ కోచ్ తామరైకన్నన్‌పై బాధితురాలు మొదట మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేసింది.

Read Also : ‘లైగర్” హీరోయిన్ ఇంటిపై ఎన్సీబీ దాడులు

అయితే, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె పుదుచ్చేరి చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సంప్రదించింది. అప్పుడు పిసిడబ్ల్యుసి కోచ్ లు తామరైకన్నన్, జయకుమార్ తో పాటు మధురై పాంథర్స్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు దామోదరన్ అతని కుమారుడు రోహిత్ కార్యదర్శి వెంకట్ పై మెట్టుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకూ అరెస్ట్ వంటి చర్యలు తీసుకోలేదు. రోహిత్ దామోదరన్ పారిశ్రామికవేత్త దామోదరన్ కుమారుడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో మదురై పాంథర్స్ క్రికెట్ జట్టుకు యజమాని కూడా. శంకర్ కుమార్తె ఐశ్వర్యతో రోహిత్ వివాహం ఈ ఏడాది జూన్ 27న మహాబలిపురంలో జరిగింది.

Exit mobile version