Site icon NTV Telugu

Captain Miller: మిల్లర్ తెలుగులో వస్తున్నాడు… డేట్ లాక్డ్

Captain

Captain

పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా అనౌన్స్ అయిన కెప్టెన్ మిల్లర్ తమిళ్ లో రిలీజ్ అయ్యింది. అక్కడ మార్నింగ్ షో నుంచే కెప్టెన్ మిల్లర్ సినిమాకి హిట్ టాక్ రావడంతో సోషల్ మీడియాలో ధనుష్ టాప్ ట్రెండ్ అవుతున్నాడు. ఎక్స్ట్రాడినరీ మేకింగ్ తో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ సినిమా అన్ని భాషల్లో పర్ఫెక్ట్‌గా ప్రమోషన్స్ చేసి ఉంటే, ఈరోజు ధనుష్ పాన్ ఇండియా హిట్ కొట్టి ఉండే వాడు కానీ అలా జరగలేదు. తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో… థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో తెలుగులో కెప్టెన్ మిల్లర్ సినిమాని రిలీజ్ చేయలేదు. కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ థియేటర్ లోకి వస్తుందా లేకుంటే నేరుగా ఓటీటీలోకి వస్తుందా? అని డౌట్ ని క్లియర్ చేస్తూ… తమిళ్ లో హిట్ అవ్వగానే తెలుగు థియేట్రికల్ రిలీజ్ డేట్ బయటకి వచ్చేసింది.

రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25వ తేదీన తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాను ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేశ్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక తమిళ వర్షన్ రివ్యూ విషయానికి వస్తే… ధనుష్ తన యాక్టింగ్ తో ఒక మంచి యాక్టర్‌కి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తగిలితే ఎలా ఉంటుందో… కెప్టెన్ మిల్లర్ సినిమాతో మరోసారి నిరూపించాడు అనే మాట కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ధనుష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటూ క్రిటిక్స్ కూడా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో ధనుష్‌కి లార్జర్ దెన్ లైఫ్ సినిమా ఇచ్చాడు. మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ని ధనుష్ అద్భుతంగా పోట్రె చేసాడని అంటున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ధనుష్ ట్రెమండస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొలీవూడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

Exit mobile version