Captain Miller: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ప్రియాంక మోహన్ జంటగా అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సంక్రాంతికే ఈ సినిమా కూడా రిలీజ్ అని ప్రకటించడంతో.. అందరూ షాక్ అయ్యారు. ఇప్పటికే సంక్రాంతి సినిమాలు ఎక్కువ అయ్యాయి. తెలుగు సినిమాలకే థియేటర్స్ లేవని కొట్టుకుంటున్నారు. మధ్యలో ధనుష్ కూడా నేను ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సాంగ్ లో వారిద్దరూ కలిసి కనిపించి సందడి చేసారు.
ఘోరా హరా అంటూ సాగిన సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సెన్సేషనల్ కంపోజర్ జివి ప్రకాష్ ఈ పాట కోసం పవర్ ప్యాక్డ్ నెంబర్ ని స్కోర్ చేశారు. రాకేందు మౌళి రాసిన ఇంటెన్స్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటని హై ఎనర్జీ వోకల్స్ తో ఆలపించారు. పాటలో వింటేజ్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. ధనుష్ , శివ రాజ్ కుమార్ ల ప్రజెన్స్ ఎక్స్ ట్రార్డినరీగా వుంది. ఈ పాటలో ధనుష్ , శివ రాజ్ కుమార్ కలిసి డ్యాన్స్ చేయడం కన్నుల పండగలా వుంది.
1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యుజ్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రంలో శివన్న తో పాటు సందీప్ కిషన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ హిట్ అందుకుంటాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.