Site icon NTV Telugu

Tollywood : ప్లాపుల్లో టాలీవుడ్.. ఆ ముగ్గురు ఆదుకుంటారా..?

Tollywod

Tollywod

Tollywood : టాలీవుడ్ ప్లాపులతో వెలవెల బోతోంది. ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు ప్లాపులతో సతమతం అవుతున్నాయి. పవన్ కల్యాణ్‌ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన కింగ్ డమ్ ఆశించిన స్థాయి కలెక్షన్లు లేక థియేటర్ల నుంచి ఔట్ అయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 భారీ అంచనాలతో వచ్చి చతికిల పడింది. మధ్యలో వచ్చిన చిన్న సినిమాలు ఆకట్టుకోలేక ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు అందరి చూపు ముగ్గురు హీరోల మీదనే ఉంది.

Read Also : Janhvi Kapoor : అతనితో నాకు మ్యారేజ్ అయింది.. జాన్వీకపూర్ భారీ ట్విస్ట్

తేజసజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సెప్టెంబర్ 5న రాబోతోంది. ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయి. చూస్తుంటే హిట్ కొట్టేలా కనిపిస్తోంది ఈ సినిమా. ఆ తర్వాత సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్‌ భారీ హైప్ ఉన్న మూవీ ఓజీ వస్తోంది. ఆ మూవీ పెంచుతున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. హిట్ గ్యారెంటీ ప్రచారంతో రాబోతున్న ఆ మూవీతో పవన్ కమ్ బ్యాక్ ఇస్తారని అంటున్నారు. ఆ సినిమా ఈ ఏడాది అతిపెద్ద సినిమాల్లో ఒకటి. బాలయ్య నటించిన అఖండ-2 వాయిదా పడింది. కానీ అక్టోబర్ లేదా నవంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న ఆ సీక్వెల్ సినిమా టీజర్ తోనే అంచనాలు పెంచేసింది. మరి సినిమా గనక హిట్ అయితే కలెక్షన్లు భారీగా ఉంటాయి. ఈ ముగ్గురి సినిమాలు టాలీవుడ్ ను ప్లాపుల్లో నుంచి బయట పడేస్తారని అంటున్నారు. ఈ ఏడాది వీరు హిట్స్ తో క్లోజ్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Read Also : Telangana Floods : సందీప్ రెడ్డి సాయం.. టాలీవుడ్ వాళ్లకు ఏమైంది..?

Exit mobile version