NTV Telugu Site icon

Bahubali 2: మన రికార్డులని బ్రేక్ చెయ్యడం అంత ఈజీ కాదు కానీ…

Bahubali 2

Bahubali 2

ఆర్ ఆర్ ఆర్ కన్నా ముందే ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన తెలుగు సినిమా ‘బాహుబలి 2’. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ వార్ డ్రామా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసింది. ఒక రీజనల్ మూవీకి 2200 కోట్లు రాబట్టగలిగే సత్తా ఉందని నిరూపిస్తూ, బౌండరీలని దాటి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది ‘బాహుబలి సిరీస్’. ముఖ్యంగా బాహుబలి 2ని నార్త్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకోని చూసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జపాన్ వరకూ వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ రికార్డులు ఈరోజుకీ బ్రేక్ అవ్వలేదు. డే 1 నుంచి లైఫ్ టైం కలెక్షన్స్ వరకూ ప్రతి విషయంలో బాహుబలి 2 టాప్ ప్లేస్ లోనే ఉంది. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ నుంచి లాల్ సింగ్ చడ్డా వరకూ ఎన్నో బాలీవుడ్ సినిమాలు బాహుబలి 2 కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయ్యాయి కానీ ఒక్క సినిమా కూడా బాహుబలి 2 రికార్డులని కదిలించలేకపోయాయి.

తాజాగా షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ మూవీ జనవరి 25న ఆడియన్స్ ముందుకి వస్తుండడంతో మరోసారి బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ అవ్వబోతున్నాయి అంటే మాట నార్త్ లో వినిపిస్తోంది. నాన్-హాలీడే రోజు రిలీజ్ అయిన బాహుబలి 2 మూవీ హిందీలో డే 1 దాదాపు 50 కోట్లు రాబట్టింది. ఈ రికార్డుని పఠాన్ సినిమా బ్రేక్ చేస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. పఠాన్ ప్రీబుకింగ్స్ సాలిడ్ గా ఉన్నాయి కానీ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసే రేంజులో ఉన్నాయా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. 35 నుంచి 40 కోట్ల వరకూ పఠాన్ డే 1 కలెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ డే 1 బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ అయినా లాంగ్ రన్ లో హిందీ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడం అనేది కష్టమైన పని. బాహుబలి 2 కేవలం నార్త్ లో 500 కోట్లు రాబట్టింది, ఇప్పటివరకూ ఏ ఒక్క ఇండియన్ సినిమా కేవలం ఒక్క భాషలో అంత రాబట్టిన ధాకలాలు లేవు. పఠాన్ మూవీ బాహుబలి డే 1ని బ్రేక్ చేసినా 500 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వడం మాత్రం ఇంపాజిబుల్ అనే చెప్పాలి.