Site icon NTV Telugu

NTR: ఇక తారక్ కెరీర్ లో 2016 రోజులు రావేమో…

Ntr Trivikram

Ntr Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫారిన్ లో ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. న్యూ ఇయర్ ని కూడా అమెరికాలోనే సెలబ్రేట్ చేసుకోని జనవరి ఫస్ట్ వీక్ లో తారక్ ఫ్యామిలీతో పాటు తిరిగి రానున్నాడు. సంక్రాంతికి ‘ఎన్టీఆర్ 30’ సినిమా పూజా కార్యక్రమాలు చేసి, ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా తారక్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నారు. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ రిలీజ్ అయ్యి పది నెలలు అవుతోంది, ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోని ఏడాది పైనే అయ్యింది. అంటే దాదాపు ఏడాది కాలంగా ఎన్టీఆర్ షూటింగ్ కి దూరంగా ఉన్నాడు. ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అనుకున్న ‘ఎన్టీఆర్ 30’ డిలే అవుతూనే ఉంది, దీంతో ‘ఎన్టీఆర్ 31’ కూడా సెట్స్ పైకి ఆలస్యంగానే సెట్స్ పైకి వెళ్లనుంది.

‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి, 2023 ఎండ్ కి ప్రేక్షకుల ముందుకి వస్తే అద్భుతం జరిగినట్లే. కేవలం పది నెలల్లో పాన్ ఇండియా సినిమాని కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకి తీసుకోని వస్తారా? అంటే కష్టమనే చెప్పాలి. అందుకే ‘ఎన్టీఆర్ 30’ సినిమా 2023లో రిలీజ్ అయితే అద్భుతం జరిగినట్లే అనుకోవాలి. ఇక ‘ఎన్టీఆర్ 31’ గురించి ఇప్పుడే మాట్లాడుకోకపోవడం మంచిది. వాయిదా వేస్తూ షూటింగ్స్ చేయడం ఎన్టీఆర్ కి అలవాటు లేని పని. అరవింద సమేత లాంటి సినిమాని జెట్ స్పీడ్ లో షూటింగ్ చేసి రిలీజ్ చేసిన ఎన్టీఆర్ గత కొన్ని సంవత్సరాలుగా ఏడాదికో సినిమా చేస్తున్నాడు. 2017 నుంచి ప్రతి సంవత్సరం ఒక సినిమాని విడుదల చేస్తున్న ఎన్టీఆర్ 2016లో రెండు సినిమాలని రిలీజ్ చేశాడు. ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ సినిమాలు ఆరు నెలల గ్యాప్ లో రిలీజ్ అయ్యి రెండూ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇలా ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చెయ్యడం అనేది ఎన్టీఆర్ విషయంలో ఇకపై జరిగే అవకాశం లేదేమో. ఇకపై తారక్ చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం, సినిమా సినిమాకి మధ్య లుక్ చేంజ్ చెయ్యడానికి సమయం కేటాయించడం… ఇలా రకరకాల కారణలతో ఎన్టీఆర్ ఏడాదికి ఒక సినిమా చేయడమే గొప్పగా కనిపిస్తోంది. ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యు అయితే ఎన్టీఆర్ మరో ప్రభాస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ప్రస్తుతం రెండు మూడేళ్లకో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా ఇలానే అయితే నందమూరి అభిమానులకి నిరాశతప్పదు.

Exit mobile version