NTV Telugu Site icon

MCU: మార్చ్ 5న మార్వెల్ ఫేజ్ 5 నుంచి మూవీ రిలీజ్…

Gaurdians Of The Galaxy 3

Gaurdians Of The Galaxy 3

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. బ్లాక్ పాంథర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ‘వకాండా ఫరెవర్’ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది కానీ ఫేజ్ 4లో వచ్చిన మార్వెల్ సినిమాలని చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ మార్కెట్ ఆశించిన స్థాయిలో జరగలేదు, ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా సోసో గానే ఆడింది. ఇలాంటి సమయంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మళ్లీ పుంజుకోవాలి అంటే ఫేజ్ 5లో అద్భుతాలు జరగాలి. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే ఇప్పుడు మార్వెల్ లవర్స్ దృష్టి ఇప్పుడు ఫేజ్ 5 పైన పడింది. 2023 నుంచి 2024 మిడ్ వరకూ మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చే సినిమాలు ఫేజ్ 5 కిందకి వస్తాయి. ఈ ఫేజ్ 5లో మొదటి సినిమాగా ‘ఆంట్ మాన్ అండ్ ది వాస్ప్: క్వాంటూమేనియ'(Ant-Man and the Wasp: Quantumania) 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే పీక్ స్టేజ్ కి చేరాయి. ఓవర్సీస్ లో బజ్ బాగానే ఉంది కానీ ఇండియాలో మాత్రం పెద్దగా హైప్ లేదు.

‘ఆంట్ మాన్ అండ్ ది వాస్ప్: క్వాంటూమేనియ’ తర్వాత సమ్మర్ లో ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3′(Guardians of the Galaxy Vol. 3) మే 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీ ట్రైలర్ ని MCU రిలీజ్ చేసింది. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ సీరీస్ కి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు, ఇప్పటికే రిలీజ్ అయిన రెండు వాల్యూమ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి సహజంగానే ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’పైన భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్లే ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ట్రైలర్ చాలా బాగా కట్ చేసి రిలీజ్ చేశారు. మేజర్ క్యారెక్టర్స్ మధ్య ఉండే హ్యుమర్ ని అలానే మైంటైన్ చేస్తూ ఈ సీరీస్ లవర్స్ ని ఇంప్రెస్ చేశారు. ఎలక్ట్రిఫయ్యింగ్ బ్యాక్ గ్రౌండ్ తో సూపర్బ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ట్రైలర్ ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3’పై ఎక్స్పెక్టేషన్స్ ని మరింత పెంచింది. మరి ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3’ మూవీ అంచనాలని అందుకోని మార్వెల్ మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తే మకు ఫేజ్ 5కి మంచి ఓపెనింగ్ దొరుకుతుంది.

Show comments