NTV Telugu Site icon

Anupama: టిల్లు స్క్వేర్‌పైనే అనుపమ ఆశలు.. రైటో రాంగో?

Tillu Anupama

Tillu Anupama

Can Anupama get Success with Tillu Square: ఒకప్పటిలా ఇప్పుడు సినిమాల పరిస్థితులు లేవు. అప్పటి సీన్ ఏంటో తెలియదు కానీ ఇప్పుడు హీరోయిన్ కెరీర్ గ్రాఫ్ పెరగాలంటే రూల్స్ ని బ్రేక్ చేయాలి. కొత్త కథలతో గ్లామర్ కిక్ ఇవ్వాలి. అప్పుడే క్రేజీ ఆఫర్స్ తలుపు తడతాయి. ఇదే పాయింట్ ని క్యాచ్ చేసిన ఓ మల్లూవుడ్ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ షో కి గేట్లు తెరిచింది, ట్రోల్స్ కి గురైంది. తన కొత్త ప్రాజెక్ట్ ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందో అన్న టెన్షన్ లో ఆమె ఉందని చెప్పొచ్చు. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది. ఆమెనే అనుపమ పరమేశ్వరన్. టాలీవుడ్ లో మొన్నటి వరకు పద్దతైన పాత్రలు చేసిన ఆమె టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డాల్ గా మారిపోయింది. టీజర్ ,ట్రైలర్ లో తను కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అనుపమ ఇంత హాట్ గా ఉంటుందా అనే కామెంట్స్ వచ్చాయి. అయితే పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసి బోర్ కొట్టిందని, కమర్షియల్ మీటర్ లో నటనకు అవకాశం ఉన్న లిల్లి పాత్ర రావడంతో ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు క్లారిటీ ఇచ్చింది.

Tillu Square: నాగవంశీ సంచలన నిర్ణయం.. మీడియాకి నో షోస్!

అయితే ఈ సినిమా కోసం అనుపమ తీసుకున్న నిర్ణయం రైటో రాంగ్ అన్నది ఈ శుక్రవారం తేలిపోతుంది. టిల్లు స్క్వేర్ లో తన గీత దాటి గ్లామర్ షో చేయడంతో రిజల్ట్ పై ఎగ్జైటింగ్ గా ఉంది అనుపమ. బాక్సాఫీస్ డల్లుగా ఉన్న టైంలో వస్తున్న మూవీ కావడంతో భారీ హోప్స్ పెట్టుకుంది.పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం వసూళ్ల వర్షం కురుస్తుందని టీమ్ కూడా నమ్మకంగా ఉంది. అనుపమ లాస్ట్ గా నటించిన ఈగల్ ప్లాప్ అయింది. తమిళంలో చేసిన సైరెన్ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సో టిల్లు స్క్వేర్ హిట్ కావడం ఇప్పుడు అనుపమ కెరీర్ కి చాలా కీలకం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే స్టార్ హీరోల సరసన గ్లామర్ అవకాశాలు వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మరి ఈ వీక్ ఎండ్ వచ్చే టిల్లు స్క్వేర్ అనుపమ కెరీర్ కి ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.

Show comments