Ginna: మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జిన్నా. కోన వెంకట్ కథను అందిస్తూ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5 న చిరు గాడ్ ఫాదర్, నాగ్ ది ఘోస్ట్ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.
రెండు పెద్ద సినిమాలతో పోటీ ఎందుకని మేకర్స్ తమ సినిమాను వాయిదా వేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ విషయమై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా అదే సరైన నిర్ణయమని వారితో ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త తెలియడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మా ప్రెసిడెంట్ గారు భయపడినట్టున్నారు అని కొందరు.. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏ సినిమా లేనప్పుడు పెట్టుకోండి.. కనీసం వసూళ్లయినా వస్తాయని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేయనున్నారట. గత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విష్ణు.. ఈ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో అతడికి విజయాన్ని అందిస్తుందో చూడాలి.