సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య దోబూచులాట సాగుతోంది. వీరిద్దరి ఫాలోవర్స్ సంఖ్య అటూ ఇటూ దాదాపు ఒక్కటిగా కొద్ది కాలంగా నడుస్తోంది. ఒక్కోసారి విజయ్ దేవరకొండ ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ ఉంటే… మరొక సారి బన్నీ అనుచరగణం సంఖ్య ఎక్కువ ఉంటోంది. ఈ విషయంలో ఎవరైనా ఏదైనా మైలు రాయిని క్రాస్ చేయగానే… అతి కొద్ది రోజుల్లోనే మరొకరు దానిని అధిగమించేస్తున్నారు.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ఫాలోవర్స్ సంఖ్య 13 మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని బన్నీ అధికారికంగానూ ప్రకటించాడు. విశేషం ఏమంటే… ఇదే సమయంలో విజయ్ దేవరకొండ ఫాలోవర్స్ సంఖ్య 12.9 మిలియన్లుగా ఉంది. సో… కొన్ని గంటల్లో లేదా… ఒకటి రెండు రోజుల్లో విజయ్ దేవరకొండ సైతం 13 మిలియన్ మార్క్ ను చేరడం ఖాయం. అయితే అక్కడ నుండి 14 మిలియన్ ఫాలోవర్స్ ను ఎవరు ముందు పొందుతారో చూడాలి!
