Bunny Vasu Reveals Facts Behind Allu Family Vs Mega Family: 2024 ఎన్నికలకు ముందు ఒకపక్క జనసేన, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంటే మరోపక్క వైసీపీ పోటీ చేసింది. ఈ క్రమంలో తన మామ పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా మద్దతు పలికిన అల్లు అర్జున్ తన భార్య స్నేహితురాలి భర్త తనకు స్నేహితుడే అంటూ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతుగా నంద్యాల వెళ్లారు. ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగింది అని పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. తాజాగా ఈ విషయం మీద బన్నీ వాసు స్పందించారు. ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె హీరోగా నటించిన ఆయ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో జర్నలిస్ట్ నుంచి ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా బన్నీ వాసు స్పందించారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఫ్యామిలీస్ లో ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ అన్నిటికంటే వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్ కానీ వాళ్ల ఫ్యామిలీ మధ్య జరిగిన పరిస్థితులు గాని నేను 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను.
YS Jagan: ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోడీని కలుస్తాం..
చిరంజీవి గారు ఎప్పుడూ ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలి అని ఆలోచించే వ్యక్తి. అందుకే ప్రతి ఏడాది ఆయన బెంగళూరు ఫామ్ హౌస్ కి సంక్రాంతికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఫ్యామిలీలో ఉన్న అందరినీ అక్కడికి తీసుకువెళ్తారు. నిజానికి ఇక్కడ ఉన్న అందరూ స్టార్లే వీళ్లందరినీ అక్కడికి తీసుకువెళ్లి ఆ మూడు రోజులు గడపాలన్నా చాలా ఖర్చవుతుంది. కానీ కుటుంబం అంతా ఒక్కటే అని సందేశం ఇవ్వడానికే మెగాస్టార్ చిరంజీవి గారు ఆ పని చేస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చారు. కొన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి వాళ్ల వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అంతమాత్రాన ఇప్పుడున్న ఏదో తాత్కాలిక ఎమోషన్స్ని తీసుకుని ఈ మెగా ఫ్యామిలీ అనే దాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో చూడటం అనేది నాకెందుకో తెలివైన డిసిషన్ అనిపించడం లేదు. నాకు వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటాయో తెలుసు. ఏదైనా ఒక పరిస్థితి ఏర్పడితే ఒకరికొకరు అండగా ఎలా నిలబడతారో తెలుసు. ఇవన్నీ తీసేసి మేమందరం ఒకటే అని చెప్పడానికి ఒకే ఒక్క పరిస్థితి చాలు. ఆ సిట్యుయేషన్ ఎప్పుడు వస్తుందని మేమంతా ఎదురు చూస్తున్నాం అంటూ ఈ విషయాన్ని కొట్టి పారేశారు ఇవన్నీ వాసు.