Site icon NTV Telugu

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన బుల్లెట్ భాస్కర్.. మీకు భయపడాలా..?

Sudigali

Sudigali

Sudigali Sudheer: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. ఒకప్పుడు మెజీషియన్ గా స్టేజ్ షోలు చేసుకునే సుధీర్ కి జబర్దస్త్ లో వచ్చిన అవకాశం కెరీర్ మొత్తాన్ని మార్చేసింది. సుడిగాలి సుధీర్ గా మారి కొన్నాళ్లపాటు ఒక టీంని కూడా మెయింటైన్ చేశాడు. ఇక దాని తరువాత సుడిగాలి సుధీర్ గా పేరు తెచ్చుకున్నాడు. సింగర్, డాన్సర్, యాంకర్, కమెడియన్.. ఇప్పుడు హీరో ఇలా అంచలంచలుగా సుధీర్ ఎదుగుతున్నాడు. సుధీర్ నటించిన గాలోడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాని తరువాత కాలింగ్ సహస్త్ర.. థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేనప్పటికీ ఓటిటీలో అదరగొట్టింది. ప్రస్తుతం సుధీర్.. గోట్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సుధీర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ.. శ్రీదేవి డ్రామా కంపెనీ.. ఇలా షో ఏదైనా.. కామెంట్స్ లో కామన్ గా ఉండే పేరు సుడిగాలి సుధీర్. చివరికి జాతకాల ప్రోగ్రామ్ లో కూడా సుడిగాలి సుధీర్ పేరే కామెంట్ చేయడం.. అతనిపై ఉన్న అభిమానాన్ని చూపిస్తుంది. ఇక ఇదే అభిమానాన్ని బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో వాడుకున్నాడు.

తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్.. సుడిగాలి సుధీర్ పై కామెంట్స్ చేశాడు. ” సుడిగాలి సుధీర్ కు చిలక్కి చెప్పినట్లు చెప్పా.. ఫిబ్రవరి, మార్చి పెళ్లిళ్ల సీజన్ రా.. చక్కగా మ్యాజిక్ షోలు చేసుకోరా.. ఈవెంట్ కు రూ. 5 వేలు వస్తాయి ” అని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత ” ఈ స్కిట్ చూసాక.. కామెంట్స్ లో ఒరేయ్ బుల్లెట్ భాస్కర్ గ్రౌండ్ ప్లోర్ బలిసిందా.. ? ఎవర్రా మీరంతా.. నాలుగు ఈమెయిల్ ఐడీలు పెట్టుకొని మెస్సేజ్ చేస్తే మీకు భయపడాలా.? షకీలా సినిమా కింద మీకేం పనిరా.. వి వాంట్ సుధీర్ అని, ఉదయం పూట జాతకాల ప్రోగ్రామ్ లో సుధీర్ అన్న సూపర్” అని కామెంట్స్ చేశాడు. ఇక బులెట్ భాస్కర్ కామెంట్స్ పై సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version