Hero Vaibhav New Movie Buffoon Trailer Released.
ప్రముఖ దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్ తెలుగులో కొన్ని చిత్రాలలో హీరోగా నటించాడు. అయితే… ఇక్కడ కంటే కోలీవుడ్ లోనే అతనికి కలిసొచ్చింది. అక్కడ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాల పాత్రలు చేశాడు. డిఫరెంట్ జానర్ మూవీస్ లో నటించాడు. తాజాగా అతను హీరోగా ‘బఫూన్’ సినిమా తెరకెక్కుతోంది. సముద్రతీరంలో సాగే స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ యాక్షన్ డ్రామాకు అశోక్ వీరప్పన్ దర్శకుడు. యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. అనఘ హీరోయిన్ గా చేస్తోంది. భవిష్యత్తు గురించి విపరీతమైన ఆశలు ఉన్న ఓ లోకల్ స్మగ్లర్ కథ ఇది.
తన కెదురైన సమస్యలను తెలివిగా హీరో ఎలా అధిగమించాడన్నదే ఈ చిత్ర కథ. చూస్తే కాస్తంత ‘పుష్ప’ లైన్ గా అనిపించవచ్చు కానీ దానికీ దీనికి చాలానే తేడా ఉంది. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ గా నటించిన ‘బఫూన్’లో ‘ఆడుకాలమ్’ నరేన్ కీలక పాత్ర పోషించాడు. సోమవారం విడుదలైన ‘బఫూన్’ టీజర్ చూస్తే, కథలో ఇంటెన్సిటీ బాగానే ఉందనిపిస్తోంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తనదైన మార్క్ ను ఈ టీజర్ లో చూపించాడు. మూవీ విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. వైభవ్ కు తెలుగులోనూ కాస్తంత పాపులారిటీ ఉంది కాబట్టి ‘బఫూన్’ ఇక్కడా విడుదల కావచ్చు.
