Site icon NTV Telugu

Buchi Babu Sana: బుట్టలో మరో పాన్ ఇండియా స్టార్.. ఎవరో తెలుసా?

Buchi Babu Ram Charan

Buchi Babu Ram Charan

Buchi Babu Sana Developing Script For A Pan India Star: ‘ఉప్పెన’తో దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా.. ఆల్రెడీ జూ. ఎన్టీఆర్‌తో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ వేయించుకున్న విషయం తెలిసిందే! స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో తారక్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనుండగా, దీనికి ‘పెద్ది’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. NTR30, NTR31 ప్రాజెక్టుల తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది.

అప్పటివరకూ బుచ్చిబాబు ఖాళీనే కాబట్టి, ఇతర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే ఒక స్టోరీలైన్ చెప్పి, ఓ స్టార్ హీరోని బుట్టలో పడేశాడని సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? రామ్ చరణ్. రీసెంట్‌గానే బుచ్చిబాబు, చరణ్ మధ్య కథా చర్చలు జరిగాయని.. బుచ్చిబాబు చెప్పిన స్టోరీలైన్ చెప్పడంతో, పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేయమని చరణ్ చెప్పాడని టాక్ వినిపిస్తోంది. ఈ స్టోరీకి బుచ్చిబాబు ఫ్యాంటసీ టచ్ ఇచ్చాడట. అందుకే, స్టోరీలైన్ వినగానే చరణ్ ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట!

అయితే.. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో మరో ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే, బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. అయితే.. ఆలోపు పరిస్థితులు ఎలా మారుతాయో కూడా అంచనా వేయలేం.

Exit mobile version