NTV Telugu Site icon

BroTheAvatar: దేవుడి ఫ్రెండ్ మార్కండేయుడు వచ్చేశాడు..

Pawana

Pawana

BroTheAvatar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. కోలీవుడ్ డైరెక్టర్ సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో పవన్ దేవుడిగా కనిపిస్తుండగా.. తేజ్.. డాక్టర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ లుక్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ ను క్రియేట్ చేసిన తెల్సిందే. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితమే తేజ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఇందులో తేజ్.. మార్కండేయులు అలియాస్ మార్క్ అనే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలిపారు. ఇక మార్క్ లుక్ ఎంతో స్టైలిష్ గా ఉంది. వైట్ అండ్ వైట్ సూట్ లో తేజ్ అదిరిపోయాడు. యాక్సిడెంట్ వలన విరూపాక్షలో బక్కచిక్కి కనిపించిన తేజ్.. ఈ పోస్టర్ లో తన మునుపటి రూపానికి చేరుకున్నట్లు కనిపిస్తుంది. ఇక బ్రో ది అవతార్ ఫ్రెండ్ మార్కండేయులు అని రాసుకొచ్చి మరింత హైప్ పెంచేశారు.

Mahesh Babu: మహేష్ బాబు సుఖానికి అలవాటు పడ్డాడా.. ఏంటీ నిందలు

మామకు తగ్గట్టు అల్లుడు కూడా అల్ట్రా స్టైలిష్ గా కనిపించి మెప్పించాడు. ఇక పవన్ ఫస్ట్ లుక్ లో వెనుక రుద్రుడు అనగా శివుడును చూపించి ఆయన దేవుడుగా చూపించారు. ఇక ఇప్పుడు తేజ్ పేరు మార్కండేయులు అని చెప్పుకొచ్చారు. అంటే శివుడు- మార్కండేయుడు అని చెప్పకనే చెప్పేశాడు త్రివిక్రమ్.. కాల యముడు పాశం నుంచి మార్కండేయుడును శివుడు ఎలా తప్పించాడో.. ఇప్పుడు ఈ దేవుడు.. మార్క్ ను తన చావు నుంచి తప్పించడానికి వచ్చాడు అనే విధంగా.. పురాణాలతో మిక్స్ చేశాడు త్రివిక్రమ్. మొత్తానికి పోస్టర్ ఓ రేంజ్ లో ఉంది.ఇక ఈ సినిమా జులై 28 న ప్రేక్షకుల ముందు రానుంది. మరి ఈ సినిమాతో మామ అల్లుళ్ళు ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.

https://www.youtube.com/shorts/Xa6Vk8YmpkY

Show comments