NTV Telugu Site icon

Bro: ఇక ఆగేదెలే ‘బ్రో’… ఇక హైప్ లేపుదాం పద

Bro

Bro

ప్రస్తుతం పవర్ స్టార్ పొలిటికల్‌ పనులతో బిజీగా ఉన్నారు. అందుకే బ్రో మూవీ ప్రమోషన్స్ భారమంతా మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్ మోస్తున్నాడు. హీరోయిన్లతో కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ టైం కలిసి నటించింన ఈ మెగా మల్టీస్టారర్‌ మూవీ జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ‘బ్రో’ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్ ఓపెనింగ్స్ కానున్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు మేకర్స్. ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఇక ఆగేదెలే అంటున్నారు మేకర్స్.

ఫైనల్‌గా 21న లేదా 22న బ్రో ట్రైలర్ రిలీజ్‌ చేయబోతున్నారు. హైదరాబాద్.. వైజాగ్.. తిరుపతి పట్టణాల్లో ఒకేసారి బ్రో ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఇక 25న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ప్రీరిలీజ్ నిర్వహిస్తున్నట్టుగా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. గతంలో పవర్ స్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదే సెంటిమెంట్‌తో బ్రో పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణే స్పెషల్ గెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ప్రజెంట్ పవన్ రాజకీయాలతోనే సమయం గడుపుతున్నాడు కాబట్టి. అందుకే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

Show comments