Site icon NTV Telugu

Bro The Avatar: ఈసారి మామా అల్లుళ్లు వస్తున్నారు…

Bro The Avatar

Bro The Avatar

మెగా అభిమానులకి కిక్ ఇచ్చే అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతున్న ఆ అప్డేట్ రేపటికి ట్విట్టర్ ని కబ్జా చెయ్యడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మెగా మామా అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో ది అవతార్’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ టైటిల్ ని మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ పోస్టర్స్ కూడా బయటకి వచ్చి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈసారి ఫాన్స్ కి మరింత కిక్ ఇస్తూ పవన్ కళ్యాణ్, తేజ్ లు కలిసి ఉన్న పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసారు.

Read Also: Chiranjeevi: నూటికో కోటికో ఒక్కరు NTR…

“డబుల్ బొనాంజా రైడ్ కి రెడీ అవ్వండి… పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ ఉన్న పోస్టర్ రేపు ఉదయం 10:08 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నాం” అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ‘బ్రో ది అవతార్’పై ఫాన్స్ లో అనౌన్స్ చేసిన సమయంలో అంతగా బజ్ లేదు కానీ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో మేకర్స్ ఈ సినిమాపై అందరికి ఇంట్రెస్ట్ పెరిగేలా చేసారు. ముఖ్యంగా ‘బ్రో’ మోషన్ పోస్టర్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బయటకి వచ్చి అభిమానులని ఖుషి చేసింది. మేకర్స్ ఇదే జోష్ ని మైంటైన్ చేస్తూ ప్రమోషన్స్ ని చేస్తే రిలీజ్ టైంకి ‘బ్రో ది అవతార్’ సినిమాపై సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ. మరి మామా అల్లుళ్ళు కలిసి ఉన్న పోస్టర్ ఎలా ఉండబోతుంది? ఫాన్స్ లో ఎంత జోష్ నింపబోతుంది అనేది చూడాలి.

Exit mobile version