Site icon NTV Telugu

Kannappa : కన్నప్ప సినిమాను అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం

Kannappa

Kannappa

Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ వివాదంలో చిక్కుకుంది. కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను అవమానపరిచేలా పిలక, గిలక పాత్రలను పెట్టారంటూ బ్రాహ్మణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయవాడలోని శంకర్ విలాస్ సెంటర్‌లో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివలింగానికి బ్రాహ్మణులు అభిషేకం చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ బ్రాహ్మణులను కించరుస్తోందని.. కావాలనే కన్నప్ప మూవీలో పిలక, గిలక పాత్రలు పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : Malladi Vishnu : ఐదెకరాల కోసమే శాతవాహన కాలేజీని కూల్చేశారు.. మల్లాది విష్ణు ఆరోపణలు

‘రీసెంట్ గా పిలక, గిలక పాత్రలను అధికారికంగా రిలీజ్ చేశారు. ఆ రెండు పాత్రలను బ్రాహ్మణులను కించపరిచేందుకే పెట్టారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై హైకోర్టును ఆశ్రయించాం. ఆ రెండు పాత్రలను డిలీట్ చేసినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించాలి. లేదంటే కోర్టు ద్వారా మూవీని అడ్డుకుంటాం’ అంటూ తెలిపారు. వారి నిరసనపై కన్నప్ప మూవీ టీమ్ ఏమైనా స్పందిస్తుందా లేదా అన్నది చూడాలి.

ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దానికి ప్రభాస్ కూడా రాబోతున్నట్టు సమాచారం. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమైనా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి. అయితే తాము కన్నప్ప మూవీని చాలా మంది పురోహితులకు చూపించిన తర్వాతనే.. ఎలాంటి తప్పులు లేవని క్లారిటీ తీసుకున్నాకే ఫైనల్ కాపీ చేశామని మంచు విష్ణు రీసెంట్ గా చాలా సార్లు చెబుతున్నారు.

Read Also : SVSN Varma : పవన్ కల్యాణ్‌ చెప్పినా మారరా.. ఇసుక మాఫియాపై వర్మ కామెంట్స్..

Exit mobile version