NTV Telugu Site icon

Brahmastra: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఛేంజ్!

Brahmastra

Brahmastra

 

ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ జంట‌గా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో దీన్ని ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేయడానికి నిర్మాణ సంస్థలు స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ఫ్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ భారీగా సన్నాహాలు చేస్తున్నాయి. దక్షిణాది భాషలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్మాతలు జరపాలనుకున్నారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీయార్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్టుగానూ ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో పర్మిషన్ లేని కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిల్మ్ సిటీ దగ్గర నుండి నగరంలోని ఓ స్టార్ హోటల్ కు మార్చినట్టు సమాచారం.

వెన్యూ ఛేంజ్ కు ఇదే కారణమా!?
ఫిల్మ్ సిటీ వెలుపల ఖాళీ స్థలంలో అభిమానుల మధ్య ‘బ్రహ్మాస్త్రం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు. అయితే అక్కడ ఉన్న సదుపాయాలు, అభిమానులను కట్టడి చేసే విషయంలోనూ పోలీసులకు, ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియాకు మధ్య నగదు లావాదేవీలలో తేడా రావడంతో పోలీసులు అనుమతి నిరాకరించినట్టు అనధికారంగా అందుతున్న సమాచారం. దాంతో చివరి నిమిషంలో జరిగిన ఈ మార్పుతో ఈవెంట్ ఏ సమయానికి ఆరంభమౌతుందో చూడాలి మరి!