ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మస్త్ర’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, అలియాభట్, మౌనిరాయ్ తదతరులు కీలక పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో పూర్తి అయ్యింది. దీనికి సంబంధించిన స్టిల్స్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. విశేషం ఏమంటే ఈ మూవీ దక్షిణాది రాష్ట్రాలలో రాజమౌళి సమర్పణలో రిలీజ్ అవుతోంది. భారతీయ పురాణాలు అలాగే ఆధునిక ప్రపంచం నుంచి ప్రేరణ పొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’.
Read Also : Aadhi and Nikki Galrani : హీరోయిన్ ఎమోషనల్… ఎంగేజ్మెంట్ వీడియో వైరల్
‘ఈ చిత్రం ఆధునిక సాంకేతికతతో పురాతన భారతీయ సంస్కృతికి చెందిన ఇతివృత్తాలను చూపించడంతో పాటు అత్యద్భుతమైన విఎఫ్ఎక్స్‌తో ప్రేక్షకులను కట్టి పడేస్తుంద’ని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ మూవీ గురించి నిర్మాతల్లో ఒకరై కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ” ‘బ్రహ్మాస్త్ర’ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైన, లాంగ్ విజన్ ఉన్న ప్రాజెక్ట్. ప్రెజెంటేషన్ యూనివర్సల్ అప్పీల్‌తో కూడుకుని ఉంటుంది” అని అన్నారు. దర్శకుడు అయన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ” ‘బ్రహ్మాస్త్ర’ నేను చాలా సంవత్సరాలుగా కంటున్న కల. ఇది ప్రతిష్టాత్మకమైన మూడు భాగాలుగా చేస్తున్న సినిమా. ఇప్పటి వరకు చేసిన ప్రయాణం ఎంతో అద్భుతం” అని తెలిపారు.
