Brahmasthra: వేయి నందుల బలంతో నాగార్జున!

New Project (15)

New Project (15)

 

రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇందులో కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగర్జున పాత్ర పేరు అనీశ్‌ శెట్టి. అతని చేతిలో ‘నంది అస్త్ర’ ఉంటుంది. ఇది వేయి నందుల బలం ఉన్న అస్త్రం.

 

ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ ను వైజాగ్ లో గ్రాండ్ గా ప్రారంభించారు చిత్ర సమర్పకులు ఎస్.ఎస్. రాజమౌళి. ఈ కార్యక్రమానికి దర్శకుడు అయాన్ ముఖర్జీతో పాటు హీరో రణబీర్ కపూర్ పాల్గొన్నాడు. తాజాగా ఈ సినిమాలోని నాగార్జున పోస్టర్ ను విడుదల చేశారు. మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 15న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారు. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ‘బ్రహ్మాస్త్రం’ సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది.