NTV Telugu Site icon

Brahmanandam: బ్రహ్మనందం ఇన్‌స్టా ఎంట్రీ..క్షణాలో పెరిగిపోయిన ఫాలోవర్స్

Bramanandham

Bramanandham

చలనచిత్ర పరిశ్రమలో బ్రహ్మానందాన్ని మించిన కమెడియన్ లేరు అంటే కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఆయనలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ ఇప్పటివరకు రాలేదు.కొన్ని సినిమాలు బ్రహ్మానందం కామెడీ వల్లే సక్సెస్ అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. కానీ ఒకప్పుడు ఏడాదికి ఒక 10 సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ ఉండే బ్రహ్మానందం, ఇటీవల కాలంలో పూర్తిస్థాయిలో సినిమాలు తగ్గించాడు.ఈతరం వారికి ఆయన సినిమాలు కరువై ఉండవచ్చు కానీ.. సోషల్ మీడియాలో బ్రహ్మి పేరు చెబితే ఊగిపోతారు. బ్రహ్మి లేని తెలుగు మీమ్ కంటెంట్‌ను ఊహించలేని పరిస్థితి వచ్చేసింది. మరి ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది.. అవును రీసెంట్ గా బ్రహ్మి ఇన్ స్టా లోకి అడుగు పెట్టాడు.

Also Read: Tamannaah Bhatia: నా శ‌రీరానికి నేను రుణపడి ఉంటాను : త‌మన్నా

‘Yourbrahmanandam’ IDతో ఆయన ఇన్‌స్టాలోకి వచ్చారు. ప్రజంట్ తన కొడుకు గౌతమ్‌తో కలిసి ‘బ్రహ్మానందం’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మీరు సోషల్ మీడియాలో ఉన్నారా?చెప్పండి అంటూ అభిమానులు బ్రహ్మిని అడగ్గా.. తన ఇన్‌స్టా ఐడీని తెలిపాడు బ్రహ్మి.

తాను రాసుకున్న పుస్తకం పేరు ‘ఇట్లు మీ బ్రహ్మానందం’.. దాని ఇంగ్లిష్ లో ‘Yourbrahmanandam’ అనే ఐడీతో వచ్చాడు బ్రహ్మి. ఇక ఆయన ఇన్‌స్టాలోకి రావాడం ఆలస్యం.. పెద్ద ఎత్తున అభిమానులు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఆయన ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. అలాగే ఎవరిని కూడా ఫాలో కాలేదు. కానీ బ్రహ్మానందం కి మాత్రం సుమారు 163K ఫాలోవర్స్ ఉండటం విశేషం. మరిక ఇన్‌స్టాలో తన మీద వచ్చే మీమ్స్ పట్ల ఆయన స్పందన ఎలా ఉంటుందో చూడాలి.