Brahmanandam: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా జూలై 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు శిల్పా కళావేదిక లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరోలందరూ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించిన బ్రహ్మానందం కూడా ఈ వేడుకకు విచ్చేశారు. ఇక ఈ వేదికపై బ్రహ్మానందం మాట్లాడుతూ.. పవన్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా పవన్ విజయాన్ని కోరుకొనే వ్యక్తుల్లో తానూ ఒకడిని అని,పవన్ దైవాంశ సంభూతుడు.. ఆయన విజయాన్ని ఎవరు ఆపలేరు అని తెలిపారు.
Ketika Sharma: తెల్లచీరలో.. ‘రొమాంటిక్’ భామ యమా రొమాంటిక్ గా ఉందే
మిస్టర్ బ్రో.. ఐ లవ్ యూ బ్రో అంటూ తనదైన రీతిలో నవ్వులు పూయించిన బ్రహ్మీ.. ” మీ అందరిని మళ్లీ ఇలా కలుసుకొని అవకాశం కల్పించిన బ్రో చిత్ర బృందానికి ధన్యవాదాలు. ఇక నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నటుడు, మంచి మనిషి, మంచి మనసు ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ కు, క్యూట్ బాయ్ సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్.. ఇంతమంది తేజస్సులు ఉన్న ఈ సభలో నేను ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ది గ్రేట్ పవన్ కల్యాణ్ తో ఓ చిన్న పాత్ర చేయడం అదృష్టం, ఆనందంగా ఉంది. మీ అందరు ఇలా చప్పట్లు కొట్టడం కాదు.. మీ అందరి ఆశీస్సులు కలిసి పవన్ విజయాలకు అన్ని విధాలా తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. పవన్ గురించి మాట్లాడగలిగే అతి తక్కువ మంది వ్యక్తుల్లో నేను ఒక్కడిని. ఎందుకంటే .. ఆయనకు 20 ఏళ్ల వయస్సు నుంచి నేను చూస్తున్నాను. ఆయన నవ్వును మీరందరూ చూసే ఉంటారు. పత్తికాయ పగలి.. తెల్లటి పత్తి బయటకు వచ్చినప్పుడు.. ఆ తెల్లదనంలో ఎంతటి స్పష్టత ఉంటుందో, ఎంతటి అందం ఉంటుందో.. అలాంటి అందంగా నవ్వి, నవ్వించగల వ్యక్తి పవన్. మనిషంతా మంచితనం, హాస్యం, నవ్వు. కావాలనుకునేవారికి ఇష్టమైన అవతారంలో దర్శనమివ్వగల దైవాంశ సంభూతుడు మా పవన్ కళ్యాణ్, ఈ నాలుగు ముక్కలు చెప్పడానికే ఇక్కడకు వచ్చాను. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమా మూవీ టీమ్ కు అభినందనలు. ఇకపోతే విశ్వప్రసాద్ నా బెస్ట్ ఫ్రెండ్. గడ్స్ ఉన్న ప్రొడ్యూసర్. పాన్ వరల్డ్ సినిమా తీయగలడు” అంటూ చెప్పుకొచ్చారు.
