Site icon NTV Telugu

Happy Birthday: నయా లుక్‌లో బ్రహ్మానందం తనయుడు

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందుతున్న సినిమా గ్లిమ్స్‌ను అతని బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఒరిజినల్స్ బ్యానర్ నుండి ప్రొడక్షన్ నెం 10గా నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ పోస్టర్‌ను గౌతమ్ క్యారెక్టర్‌లోని పెయిన్‌ను తెలియచేసే విధంగా చిత్ర యూనిట్ డిజైన్ చేసింది.

నటుడిగా ‘మను’తో సర్ ప్రైజ్ చేసిన గౌతమ్ ఈసారి మరో కొత్త ఎక్స్ పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నాడు. మోనోఫోబియాతో బాధపడుతున్న రచయితగా ఇందులో కనిపిస్తున్నాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది? తను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని అతను ఎలా అధిగమించాడనేది థ్రిల్లింగ్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఎస్. ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది.

Exit mobile version