NTV Telugu Site icon

Brahmanandam: యానిమల్ బ్రహ్మానందం వెర్షన్ వీడియో వైరల్

Brahmanandam Animal Version

Brahmanandam Animal Version

Brahmanandam Animal Version Video Goes Viral: యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా న‌టించిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది. మొద‌టి రోజు నుంచే ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద రచ్చ రేపుతోంది. మొద‌టి రోజు ఈ సినిమా రూ.116 కోట్లు వ‌సూలు చేయ‌గా.. రెండో రోజు ఏకంగా రూ.236 కోట్లు, మూడో రోజు 356 కోట్లు వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం రూ.563 కోట్లతో దూసుకుపోతుండగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఈ క్రమంలో మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sandeep Reddy Vanga : చిరంజీవి గారితో అలాంటి సినిమా చేయాలని వుంది..

నిజానికి సోషల్ మీడియాలో బ్రహ్మానందం మీమ్స్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 10 తరాలకు సరిపడా మీమ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సినంత స్టఫ్ ఇచ్చాడు బ్రహ్మానందం. ఈ క్రమంలో పలు సినిమాల్లో ఆయన పాత్రలకు సంబంధించిన వీడియోలతో ఒక యానిమల్ వెర్షన్ వీడియో రూపొందించారు. 1 నిమిషం 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘యానిమల్’ బ్రహ్మీ తండ్రిగా నాజర్‌ను చూపించారు. బాద్ షా సినిమాలో వారిద్దరి మధ్య సన్నివేశాలను ఇలా ఫన్నీగా యానిమల్ వెర్షన్ లో క్రియేట్ చేశారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Show comments