Site icon NTV Telugu

Brahmaji: ఏయ్.. ఏయ్.. అన్నా.. హీరోయిన్ తో పులిహోర కలుపుతున్నావా..?

Samyukta

Samyukta

Brahmaji: సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన నటన, చలాకీతనం, కామెడీ, సెటైర్లు, కౌంటర్లు అందరికి తెలిసినవే. స్టేజిమీద అయినా, సోషల్ మీడియాలో అయినా బ్రహ్మజీ వేసే కౌంటర్లకు నవ్వు ఆగదు అంటే అతిశయోక్తి కాదు. ఇక కొన్నిరోజుల ముందు.. అనసూయ ఆంటీ వివాదం ఎంత రచ్చచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దానికి కౌంటర్ గా బ్రహ్మజీ.. నన్ను అంకుల్ అంటే.. పోలీస్ కేస్ పెడతా అని ట్వీట్ వేసి షాక్ ఇచ్చాడు. ఇక్కడితో అయిపోలేదు. సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అయితే దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ప్రభాస్.. ఆదిపురుష్ టీజర్ లంచ్ లో డైరెక్టర్ ఓం రౌత్ ను.. కమ్ టూ మై రూమ్ అన్న పదం ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే. దాన్ని బ్రహ్మాజీ ఇమిటేట్ చేస్తూ సుమ షోలో సుమ .. కమ్ టూ మై రూమ్ అంటూ చేసిన హంగామా ఇప్పటికీ మర్చిపోలేం. ఇక తాజాగా ఈ నటుడు.. విరూపాక్ష బ్యూటీ సంయుక్తను సరదాగా ఏడిపించాడు.

Nayanthara: ఆ ఇద్దరి హీరోలకు నయన్ టెస్ట్.. పాస్ అయ్యేది ఎవరు..?

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నిన్న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటు సంయుక్తకు మంచి పేరు వచ్చింది. దీంతో సంయుక్త ట్విట్టర్ అభిమానులతో చిట్ చాట్ మొదలుపెట్టింది. విరూపాక్ష ట్రైలర్ ఎలా ఉంది అంటూ అడిగేసింది. ఈ ప్రశ్నకు అభిమానులు తమదైన రీతిలో జవాబులు చెప్పుకొస్తుండగా.. బ్రహ్మాజీ కూడా తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చి అదరగొట్టేశాడు. “ట్రైలర్ నచ్చిందా.. చెప్పండి అన్న ప్రశ్నకు.. చాలా బావుంది ప్లాటినం లెగ్ గారు” అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి సంయుక్త.. ” అర్రే.. ఏంటి బ్రహ్మీ గారు” అంటూ సిగ్గులు మొగ్గలు వేసింది. ఇక బ్రహ్మాజీ అలా అనడానికి కారణం కూడా లేకపోలేదు. టాలీవుడ్ ఎంట్రీనే పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ తో ఇచ్చింది. అది హిట్.. ఆ తరువాత బింబిసార హిట్, సార్.. హిట్. ఇలా అమ్మడు అడుగుపెట్టిన ప్రతి సినిమా హిట్ అవడంతో బ్రహ్మాజీ గోల్డ్ లెగ్ బదులు ప్లాటినం లెగ్ అనేశాడు. ఇక వీరిద్దరి కామెంట్స్ చూసిన అభిమానులు.. ఏయ్.. ఏయ్.. అన్నా.. హీరోయిన్ తో పులిహోర కలుపుతున్నావా..?.. చిలిపి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version