NTV Telugu Site icon

Brahmaji : వాళ్ళు తప్పు చేస్తే మీరు అదే తప్పు చేయకూడదు.. ఏపీ పాలిటిక్స్ పై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్

Brahmaji

Brahmaji

Brahmaji Indirect Tweet on TDP Attacks: ఆంధ్రప్రదేశ్లో ఇంకా నూతన ప్రభుత్వం ఏర్పడక ముందే చాలా చోట్ల వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నట్లుగా ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటివరకు పలువురు నేతలు మాత్రమే స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ జగన్ కూడా ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

Satyabhama: దర్శకత్వం అమ్మలాంటి పని.. నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత: శశికిరణ్ తిక్క ఇంటర్వ్యూ

గౌరవ గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ఇదే పరిస్థితుల మీద సినీ నటుడు బ్రహ్మజీస్ స్పందించాడు తాను ప్రస్తుతం పుష్పా సినిమా షూటింగ్లో బిజీగాఉన్నానని ఆయన పేర్కొన్నాడు. దయచేసి ఎవరు పనులు చేసుకోండి ఇప్పటివరకు ఉన్న ఎక్సైట్మెంట్ ఆపుకుని ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది. ఏపీ ఇప్పుడు సేఫ్ హాండ్స్ లో ఉంది. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు మన జీవితాలను ఎలా మార్చుకోవాలి అనేది ముందు అది ఆలోచించండి. ఆ దిశగా పనిచేయడం మొదలు పెట్టండి. వాళ్లు తప్పు చేస్తే మళ్లీ మీరు అదే తప్పు చేయకూడదు కదా అంటూ టిడిపి శ్రేణులకు ఆయన పరోక్షంగా సూచనలు చేసినట్లు కనిపిస్తోంది.

Show comments