Site icon NTV Telugu

Brahmaji: ప్రభుత్వ సంస్థపై విరుచుకుపడిన నటుడు.. క్షమాపణలు చెప్పరా..?

Brhmaji

Brhmaji

Brahmaji: సినీ నటుడు బ్రహ్మజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక సోషల్ మీడియాలో ఛలోక్తులు విసురుతూ నెటిజన్స్ తో దగ్గర ఉండే బ్రహ్మాజీకి ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ విషయాన్నీ ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. విమానం సమయానికి రాలేదని, కనీసం ఆ విషయాన్ని ఎయిర్ లైన్స్ సంస్థ చెప్పలేదంటూ బ్రహ్మాజీ వాపోయాడు.

“నేను చండీఘర్ నుంచి కులు వెళ్ళడానికి రెండు గంటల నుంచి ఎయిర్ పోర్టులోనే ఎదురుచూస్తున్నాను. విమానం లెట్ అవుతుందని అలయన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ నుంచో ఒక సమాచారం కూడా అందలేదు. దాదాపు 5 గంటల తరువాత విమానం వచ్చింది. అయినా ఆ సంస్థ నుంచి ఒక్క సారీ కూడా లేదు. ఎందుకంటే అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి..” అని సెటైర్ వేశాడు. అంటే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇలా పనిచేసున్నాయి అని బ్రహ్మాజీ ఇన్ డైరెక్ట్ గా కొంటెర్ వేశాడా..? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొంతమంది మీరు ఇంకా లక్కీ 5 గంటల తరువాత అయినా విమానం వచ్చింది.. మేము ఇంకా ఇక్కడే ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version