Site icon NTV Telugu

Prabhas: ట్రెండింగ్ లో బాయ్ కాట్ మారుతి.. మరీ ఇంత దారుణమా

Maruthi

Maruthi

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ ను పూర్తిచేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలను పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఇక ఈ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే సినిమాను ప్రభాస్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఈ విషయమై మారుతి కూడా నిజమే అని చెప్పడంతో ఈ కాంబో సెట్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆగస్టు 25 న ప్రభాస్- మారుతీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నదట. రేపు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలు కానున్నదని ప్రచారం సాగుతోంది. దీంతో ప్రభాస్ అభిమానులు మారుతిని ఏకిపారేస్తున్నారు.

బాయ్ కాట్ మారుతి హ్యాష్ ట్యాగ్ తో ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్ ఎక్కడ .. నీ రేంజ్ ఎక్కడ.. అతనితో సినిమా తీయడమేంటి..? అని కొందరు. ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే సినిమాలు తీయకు మారుతి అని మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా మరికొందరు మరీ దారుణంగా తిట్టిపోస్తున్నారు. ప్రభాస్ తో సినిమా తీస్తే చంపేస్తామని, మొహమాటం కొద్దీ ప్రభాస్ సినిమా ఒప్పుకున్నాడు కానీ కథ నచ్చి ఉండదు.. రేపు పూజ జరిగితే టాలీవుడ్ నుంచి మారుతిని బాయ్ కాట్ చేసేవరకు పోరాడతామంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం బాయ్ కాట్ మారుతి ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం. మరి ఈ సినిమా గురించిన వార్తల్లో ఎంత నిజం ఉందో, లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Exit mobile version