అఖండతో బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను… స్కంద సినిమాతో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. రామ్ కటౌట్‌కి మించిన యాక్షన్‌తో కాస్త నిరాశ పరిచాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఇటీవలె బోయపాటి మరోసారి గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమాకు లాక్ అయినట్టుగా వార్తలొచ్చాయి కానీ ఈ సినిమాలో హీరో ఎవరనేది బయటికి రాలేదు. గతంలో అల్లు అరవింద్, బాలయ్యతో భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. ప్రజెంట్ బోయపాటి అఖండ సీక్వెల్ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. దీంతో బోయపాటి, గీతా ఆర్ట్స్… అఖండ2 ప్లాన్ చేస్తుందా? లేదంటే, బన్నీతో సినిమా ఉంటుందా? అనేది తేలకుండా ఉంది. గతంలో బోయపాటి, గీతా ఆర్ట్స్ కలయికలో ‘సరైనోడు చిత్రం వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో సరైనోడు తర్వాత బన్నీతో మరో మాస్ సినిమా ప్లాన్ చేశాడు బోయపాటి కానీ వర్కౌట్ కాలేదు.
దీంతో ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితోనే బోయపాటి, గీతా ఆర్ట్స్ సినిమా ఉండే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది. లేదంటే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఉండే అవకాశముందన్నారు కానీ ఈ ముగ్గురితో కాకుండా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి. ఇందులో నిజమెంత అనేది తెలియదు గానీ… ఈ న్యూస్ మాత్రం క్రేజీగా మారింది. లైగర్ తర్వాత క్లాస్ సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ… త్వరలోనే ఫ్యామిలీ స్టార్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ పోలీస్ స్టోరీ చేస్తున్నాడు. ఇప్పుడు బోయపాటితో సినిమా అంటే… ఇది ఊరమాస్ బొమ్మ అనే చెప్పాలి. ఖచ్చితంగా రౌడీ హీరోని రకరకాల కత్తులు పట్టించి… బోయపాటి సరికొత్త మాస్ హీరోగా చూపించడం గ్యారెంటి. మరి నిజంగానే ఈ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.