Site icon NTV Telugu

Boyapati Rapo: బాలయ్య కోసం ముందుకొచ్చిన బోయపాటి?

Boyapati Rapo

Boyapati Rapo

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైన తర్వాత… ఒక సినిమా చెప్పిన డేట్ కి రిలీజ్ చెయ్యడమే కష్టం అవుతుంది. నెలలకి నెలలు వాయిదా పడుతూ, చెప్పిన డేట్ కన్నా ఎంతో డిలేతో ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఇలాంటి సమయంలో మా సినిమా మాత్రం చెప్పిన డేట్ కన్నా నెల రోజుల ముందే రిలీజ్ చేయబోతున్నాం అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసారు బోయపాటి శ్రీను-రామ్ పోతినేని. ఈ ఊర మాస్ డైరెక్టర్ అండ్ ఇస్మార్ట్ హీరో కలిసి చేస్తున్న సినిమా ‘బోయపాటి రాపో’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పై ఉంది. ఇటీవలే మంచి గ్లిమ్ప్స్ తో సినిమాపై అంచనాలు పెంచిన బోయపాటి శ్రీను, ఈ సినిమాకి ‘స్కంద’ అనే టైటిల్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. త్వరలో ఈ టైటిల్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో దసరా కానుకగా ‘బోయపాటి రాపో’ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసారు.

లేటెస్ట్ గా అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నెలకి ఈ సినిమాకి ప్రీపోన్ చేసారు. అక్టోబర్ 20 నుంచి సెప్టెంబర్ 15కి బోయపాటి రాపో సినిమాని ప్రీపోన్ చేసారు. చెప్పిన డేట్ కన్నా ముందు సినిమాని రిలీజ్ చెయ్యడం గొప్ప విషయమే కానీ ఈ రిలీజ్ డేట్ ముందుకి రావడం వెనక బాలయ్య కారణంలా కనిపిస్తున్నాడు. బాలయ్య-అనీల్ రావిపూడి కాంబినేషన్ లో దసరాని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తుంది ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. బోయపాటి రాపో సినిమా, బాలయ్య సినిమా ఒక రోజు తేడాతోనే థియేటర్స్ లోకి వస్తున్నాయి. రెండు మాస్ సినిమాలు ఒకరోజు తేడాతో థియేటర్ లో రిలీజ్ చేయడం ఎందుకు అనుకున్నారో లేక బోయపాటి శ్రీనునే బాలయ్య కోసం రిలీజ్ డేట్ ని ముందుకి తెచ్చాడో తెలియదు కానీ దసరాకి బాలయ్య vs బోయపాటి బాక్సాఫీస్ వార్ చూడాలని వెయిట్ చేస్తున్న వాళ్లకి మాత్రం నిరాశ తప్పలేదు.

Exit mobile version