Site icon NTV Telugu

Tollywood : బోయపాటి, బాబీ, గోపిచంద్, అనిల్ బిజీ.. వాట్ హ్యాపెన్ కొరటాల?

Koratala Siva

Koratala Siva

బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న అఖండ2 షూటింగ్ చివరి దశకి వచ్చింది. సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న నేపథ్యంలో ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు దర్శకుడు బోయపాటి. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబోలో సింహ, లెజెండ్, అఖండ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. కాగా, అఖండ 2 తర్వాత బోయపాటి శీను గీత ఆర్ట్స్  బ్యానర్ పై నాగ చైతన్యను డీల్ చేయబోతున్నాడని టాక్.

ఢాకూ మహారాజ్‌తో బాలయ్య ఖాతాలో హిట్టేసిన బాబీ నెక్ట్స్ చిరంజీవిని లైన్లో పెట్టాడు. సెప్టెంబర్ నుండి ఈ నయా వెంచర్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక వీర సింహారెడ్డి తర్వాత బాలీవుడ్‌లో టెస్ట్ డ్రైవ్‌కు వెళ్లిన గోపిచంద్ మలినేని టాలీవుడ్‌లో మళ్లీ లాండ్ అయ్యాడు. బాలయ్యతో 111ని సెట్ చేసుకున్నాడు. ఇక అనిల్ రావిపూడి సంగతి తెలిసిందే. బాలయ్య, వెంకీ లైన్ లో ఉన్నారు.  ఇలా ఈ డైరెక్టర్లంతా ఓ సినిమా కంప్లీట్ కాగానే లేదా థియేటర్లలోకి వచ్చిన ఆరునెలల్లోనే మరో హీరోను సెట్ చేస్తే కొరటాల దేవరతో హిట్ కొట్టి దాదాపు ఏడాది కావొస్తున్నా కొత్త మూవీకి కమిటైన దాఖలాలు లేవు. అదిగో ఆ హీరో ఇదిగో ఈ హీరోతో కొరటాల నెక్ట్స్ సినిమా అంటున్నారు తప్ప అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. దేవర2 కోసమే వెయిట్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తుంది.  కానీ తారక్ ఇప్పట్లో చిక్కేట్లు లేడు. నీల్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ లైన్లో ఉన్నారు. కొరటాలకు కూడా తారక్ కమిట్మెంట్స్ తెలుసు. కానీ నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించేందుకు ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నాడో ఈ స్టార్ డైరెక్టర్. మళ్లీ ఎప్పుడు మెగాఫోన్ పడతాడో లెట్స్ సీ.

Exit mobile version