Mike Tyson: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఆరోగ్యంపై గత రెండు రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు కారణం ఆయన వీల్ చైర్ లో స్టిక్ పట్టుకొని కనిపించడమే.. దీంతో అసలు మైక్ టైసన్ కు ఏమైంది..? ఆయన ఎందుకు వీల్ చైర్ లో కూర్చున్నారు అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం టైసన్ కొన్ని రోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారట. దీంతో వైద్యులు ఆయనకు వీల్ చైర్ ను సజిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువసేపు నిలబడలేకపోవడంతో ఎక్కడికి వెళ్లినా వీల్ చైర్ లోనే వెళ్తున్నాడట.. ఇక నిలబడాల్సి వస్తే కర్ర సహాయంతో నిలబడగలుగుతున్నాడట. ప్రస్తుతం మైక్ టైసన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
అరెరే ప్రపంచాన్ని గడగడలాడించిన మైక్ కు చివరికి ఈ గతి పట్టిందే అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్న విషయాలను ప్రస్తుతం నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు. నాకు సమయం దగ్గరపడింది అంటూ ఒక ఇంటర్వ్యూలో మైక్ చెప్పుకొచ్చాడు. ఆ వ్యాఖ్యలు అనడానికి కారణం ఇదే అయ్యి ఉంటుందని చెప్పుకొంటున్నారు. ఇక మరోపక్క మైక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకొంటున్నారు. ఇకపోతే మైక్ టైసన్ తొలిసారి లైగర్ సినిమాలో నటించాడు. ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
