Site icon NTV Telugu

Vijay vs Beast : విజయ్ వర్సెస్ యశ్ క్లాష్ తప్పదా..?

Beast

Beast

Box Office War Between Thalapathy Vijay ‘Beast’ and Hero Yash ‘KGF2’ Movies.

ఇళయ దళపతి విజయ్ తాజా చిత్రం ‘బీస్ట్’ విడుదలకు ముస్తాబవుతోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ‘కెజియఫ్2’తో క్లాష్ కి సిద్ధం అవుతున్నట్లు వినిపిస్తోంది. యష్ నటించిన ‘కెజిఎఫ్2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ కి రెడీ అవుతోంది. ఇటీవల కాలం వరకూ ‘బీస్ట్’ మేకర్స్ సినిమా రిలీజ్ ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఏప్రిల్ 2022లో విడుదల చేస్తామని యూనిట్ తెలియజేసింది.

తాజా సమాచారం మేరకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు ‘బీస్ట్’ను ఏప్రిల్ 13న విడుదల చేయాలని నిర్ణయించినట్లు వినిపిస్తోంది. అదే నిజమైతే ‘కెజిఎఫ్2’తో బాక్సాఫీస్ పోరు తప్పదు. ఎందుకంటే ఒక రోజు గ్యాప్ లోనే రెండు సినిమాలు పోటీపడబోతున్నాయన్నమాట. పోటీ ఖాయం అని ట్రేడ్‌లో వినిపిస్తున్నప్పటికీ ఎవరూ ఖచ్చితమైన రిలీజ్ డేట్స్ ను అధికారికంగా ప్రకటించలేదు. మరి ఆ యా దర్శకనిర్మాతల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version