NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK-Koratala Siva: టాలీవుడ్‌లో ఇండస్ట్రీ వర్గాల్లో ఒక క్రేజీ కాంబినేషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామా పట్టాలెక్కబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సినీ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమాలో సెకండాఫ్ హైలైట్‌గా నిలవబోతుందని టాక్. ముఖ్యంగా కొరటాల శివ బాలయ్య కోసం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఫ్లాష్‌బ్యాక్ డిజైన్ చేశారట. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని, ఇందులో బాలయ్య ఊరమాస్ అవతార్‌లో కనిపిస్తారని సమాచారం. భారీ మాస్ సీక్వెన్స్‌లతో పాటు, ఆ పాత్ర చుట్టూ ఉండే బలమైన డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ఇన్‌సైడ్ వర్గాల టాక్.
ఈ ప్రాజెక్ట్ కోసం బాలకృష్ణ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డిఫరెంట్ మేకోవర్‌లో కనిపించబోతున్నారట. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్‌తో పాటు, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో, కథ విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా కీ రోల్ పోషించనున్నాయని తెలుస్తుంది. ఒక విలక్షణమైన కథాంశంతో, పూర్తిస్థాయి మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించేందుకు కసరత్తులు జరుగుతున్నాయని సమాచారం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మే 1న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బాలయ్య తన 111వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే కొరటాల శివ ప్రాజెక్ట్‌ను కూడా లైన్‌లో పెట్టారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
తాజావార్తలు
-
US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
-
CM Revanth Reddy: మన్మోహన్ సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ‘భారతరత్న’ ఇవ్వాల్సిందే..
-
CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?