Release Clash : ఆగస్ట్‌లో ‘వైఫ్ అండ్ హస్బెండ్’ మధ్య బాక్సాఫీస్ ఫైట్

Bollywood

Bollywood

ఈ ఆగస్ట్ మంత్‌లో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఓ ఇంటస్ట్రింగ్ వార్ జరగబోతోంది. స్టార్ కపుల్ సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ఫైట్ చేసుకోబోతున్నారు. ఫస్ట్ టాక్సిక్‌తో కియారా ఎంట్రీ తీసుకోబోతోంది. యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే పలు వాయిదాలు పడి.. ఆగస్ట్ 26న వస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందులో నదియాగా బ్లైండ్ గర్ల్ క్యారెక్టర్‌లో కనిపించబోతోందట కియారా.

టాక్సిక్ తర్వాత వన్ డే గ్యాప్ తీసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సిద్ధార్థ్ మల్హోత్రా. ఆయన నటించిన ఫోల్క్ మైథాలజీ ఫిల్మ్ వ్యాన్ ఆగస్ట్ 28న రిలీజ్ కాబోతోంది. యాక్చువల్లీ ఈ ఏడాది మే15న రిలీజ్ డేట్ అనుకున్నారు. కానీ ఐపీఎల్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా మూవీ ఆగస్ట్ 28పై కర్చీఫ్ వేసుకుంది. ఈ మూవీని బాలాజీ మోషన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. పంచాయత్ సిరీస్ ఫేం అరుణాభ్ కుమార్ అండ్ దీపిక్ మిశ్రా దర్శకులతో పాటు నిర్మాతలుగానూ వ్యవహరిస్తున్నారు. టాక్సిక్, వ్యాన్ చిత్రాలు రెండూ రక్షాబంధన్ టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టాక్సిక్ పాన్ ఇండియా రిలీజ్ చేస్తుండగా.. వ్యాన్ కూడా బాలీవుడ్ యాంటిసిపెటెడ్ చిత్రాల్లో ఒకటిగా మారింది. ఆగస్ట్ మంత్ ఎండింగ్ వీళ్ల మధ్య బాక్సాఫీస్ వార్ జరగబోతుందనుకుంటే.. ఈ ఇద్దరు శ్రద్దాకపూర్‌తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. శ్రద్దనటించిన ఈత ఆగస్ట్ 28నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరీ ఈ ముగ్గురిలో ఎవరు విన్ అవుతారో..? తేలాలంటే.. ఆగస్ట్ మంత్ ఎండింగ్ వరకు ఆగాల్సిందే.

×
×
Ad