శ్రీలీల ఉంటే ఇక ఆ సినిమాలో స్పెషల్ సాంగ్స్ కోసం మరో భామను వెతకాల్సిన పని లేదు. ఎందుకంటే హీరోయిన్ రోల్‌కే కాదు ఐటమ్ నెంబర్‌కు ఫర్ ఫెక్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. డ్యూయెట్ సాంగైనా, ఊర మాస్ పాటైనా మేడమ్ రచ్చ రంబోలా చేయాల్సిందే. స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లకు నిర్మాతలు కోట్లు వెచ్చించి తెచ్చుకునే ఛాన్స్ లేకుండా కిసిక్ బ్యూటీ డ్యూయల్ రోల్ పోషించేస్తోంది.
Also Read : Anushka : రెండేళ్లుగా హిట్ చూడని హీరో కోసం అనుష్క్ బయటకు వస్తుందా?
ధమాకాలో పల్సర్ బైక్, జింతాకా అంటూ మాసీ స్టెప్పులు మొదలెట్టిన దగ్గర నుండి డ్యాన్సింగ్ క్వీన్‌గా ముద్రపడిపోయింది శ్రీలీల. ఫీమేల్ లీడ్‌గా నటిస్తే మాస్ సాంగ్ కంపల్సరీ. ఇక ఐటమ్ నంబర్ కోసం మరో భామకు తెచ్చుకోనక్కర్లేదు. ఏ టు జెడ్ ఫెర్మామెన్స్ ఇచ్చేస్తుంది కిస్సిక్ బ్యూటీ. యూట్యూబ్‌ను షేక్ చేయాలంటే మిస్ లీల ఉంటే చాలనేంతలా ప్రొడ్యూసర్ల మైండ్లలో ఫిక్స్ అయ్యేలా చేసింది. సినిమాపై హైప్ రావాలా, అటెన్షన్ కావాలా వైరల్ వయ్యారీతో డ్యాన్స్ చేస్తే పోలా అని భావిస్తున్నారు. గుంటూరు కారంలో కుర్చీ మడత పెట్టినా, జూనియర్‌లో వైరల్ వయ్యారీగా మారినా తాను హీరోయిన్ కాని పుష్ప2లో కూడా కిస్సిక్ బ్యూటీగా ర్యాంపేజ్ గ్లామర్ షోతో మాస్ మహారాణిగా మారిపోయింది. ఇటు హీరోయిన్‌గా, ఇటు ఐటమ్ గర్ల్ గా మూవీకి వన్ ఉమెన్ షోగా మేకోవరైంది శ్రీలీల. అంటే నిర్మాతలకు డబుల్ బోనాంజాలా మారిన మేడమ్.. నెక్ట్స్ రవితేజ మూవీ మాస్ జాతరలోనూ అటు క్లాసీ లుక్, ఇటు మాసీ సాంగ్స్‌లో గత్తర లేపడానికి రెడీ అయ్యింది. మరోసారి ఈ జోడీ బాక్సాఫీస్ దగ్గర ధమాకా హిట్ నమోదు చేస్తుందా ప్లాపుల్లో ఉన్న రవితేజ, శ్రీలీలకు కంబ్యాక్ మూవీగా మారుతుందో లేదో చూడాలి.
