Boney kapoor confirmed Janhvi Kapoor Marriage with Sikhar Pahariya: శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అయితే దురదృష్టమో, అదృష్టమో తెలియదు కానీ ఆ సినిమాలు ఏవి ఆమెకు కలిసి రాలేదు. దీంతో తల్లి లాగానే సౌత్ సినీ పరిశ్రమలో వెలిగిపోవాలని భావిస్తున్న ఆమె సౌత్ మీద ఫోకస్ పెట్టి పెట్టగానే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం దొరికింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం కూడా దొరికింది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది అనే సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. ‘
VK Naresh: ఏపీ ఎన్నికలకు ముందు రక్తపాతం.. నటుడు సంచలన వ్యాఖ్యలు
అయితే ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న ఆమె పెళ్లి గురించి ఆమె తండ్రి బోనీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ పెళ్లి పీఠలు ఎక్కబోతన్నట్టు బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో కన్ఫామ్ చేసారు. ఇక జాన్వీ ప్రియుడి పేరు శిఖర్ పహారియా. శిఖర్ తండ్రి సంజయ్ పహారియా .. మహారాష్ట్రలో పెద్ద బిజినెస్ మ్యాన్. అయితే తల్లి మాత్రం మహారాష్ట్ర మాజీ సీఎం, కేంద్ర మాజీ హోం మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే కుమార్తె. గత కొన్నేళ్లుగా జాన్వీ కపూర్ శిఖర్ డేట్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జాన్వీ, శిఖర్ కలిసి ఉన్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు బోనీ కపూర్ వెల్లడించారు. త్వరలో ఎంగేజ్మెంట్ సహా పెళ్లి డేట్ కూడా చేబుతామని ఆయన అంన్నారు. ఈ మేరకు నేషనల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున మీదకు వచ్చాయి. జాన్వీ కపూర్ ఎప్పుడు పెళ్లి కబురు చెబుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది.