సూపర్ హీరో కథలు బాలీవుడ్‌కు కొత్త కాదు.. హృతిక్ క్రిష్ సిరీస్ చిత్రాలు అతడికి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేలా చేసింది. కానీ షారూఖ్ ఖాన్ రా.. వన్‌తో ప్రయోగం చేసి విఫలయ్యాక.. ఈ జోనర్ చిత్రాల జోరు తగ్గింది. క్రిష్4 కోసం గ్రీక్ గాడ్ ట్రై చేస్తున్నా బడ్జెట్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ హోల్డ్ అయ్యింది. ఇంతలో పొరుగు ఇండస్ట్రీలో రెండు, మూడు సూపర్ హీరో చిత్రాలు సూపర్ హిట్ కొట్టాక మళ్లీ స్టార్స్‌కు ఆ జోనర్ వైపు పురుగు తొలుస్తోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాన్‌స్టర్ తర్వాత సల్మాన్ ఖాన్ సూపర్ హీరో కథ చేయబోతున్నాడని ఎప్పుడి నుండో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఇలాంటి స్టోరీ నేరెట్ చేయగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. కామెడీ విత్ సూపర్ హీరో కథను మేక్ చేశారట. గతంలో రాజ్ హింటిచ్చాడు. ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కుతుందని సమాచారం. సల్మాన్ ఖాన్ ప్లాన్స్ మొదలు పెడితే అమీర్ ఖాన్ కూడా సూపర్ హీరో జోనర్‌పై ఫోకస్ చేస్తున్నాడట. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, ఆర్ బాల్కితో మిస్టర్ ఫర్ ఫెక్ట్‌తో డిస్కర్షన్ చేశారని నార్త్ బెల్ట్ అంటోంది. అయితే చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని స్రిప్ట్ వర్క్ జరగాల్సి ఉందని టాక్. ఫైనల్ స్క్రిప్ట్ చూశాకే అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటాడని బజ్. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్స్ కార్య రూపం దాల్చుతుందో లేదో..?

