NTV Telugu Site icon

War 2: ‘దేవర’ డైడ్‌లైన్ ఫిక్స్.. ‘వార్ 2’ రంగం సిద్ధం!

War 2

War 2

ఈసారి బౌండరీస్ దాటి.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం దేవరతో మృగాల వేట చేయిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఆదిపురుష్‌లో రావణ్‌గా నటించిన ‘సైఫ్ అలీఖాన్’ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, సైఫ్ పై భారీ యాక్షన్స్ సీక్వెన్స్‌ షూట్ చేశారు. సైఫ్ యాక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌ సీజన్ ఏప్రిల్ 5న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఈ ఏడాది నవంబర్‌ వరకు దేవర షూటింగ్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట తారక్. ఆ వెంటనే బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్2లో జాయిన్ అవనున్నాడట. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించనున్న వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్ధం నెక్స్ట్ లెవల్లో ఉంటుందని బీ టౌన్‌లో టాక్ నడుస్తోంది.

ముఖ్యంగా ఎన్టీఆర్ విలనిజం తట్టుకోవడం కష్టమే అంటున్నారు. అంతలా తారక్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారట. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్‌ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని దాదాపు ఓకే అయిందని వినిపిస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ హృతిక్ హీరోయినా? లేక ఎన్టీఆర్ హీరోయినా? అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తోంది కియారా. ఇకపోతే.. వార్ 2 కంప్లీట్ అయిపోగానే, వెంటనే సమ్మర్‌లో ప్రశాంత్‌ నీల్‌తో ఎన్టీఆర్ 31 షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు తారక్. ఏదేమైనా.. ఈ ప్రాజెక్ట్స్‌తో ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం ఖాయం.

Show comments