NTV Telugu Site icon

Bollywood : బీటౌన్ హీరోలకు డిజాస్టర్ ఈద్ !

Bollywood

Bollywood

ప్రస్తుతం బాలీవుడ్ కు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా కన్పిస్తోంది. కోవిడ్ మొదలుకొని, గత రెండు నెలలుగా అక్కడ సౌత్ మూవీస్ హంగామాతో చతికిలపడిపోయింది బీటౌన్. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు దేశవ్యాప్తంగా సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉత్తర భారత సినీ మార్కెట్‌లో సంచలనం సృష్టించాయి. అక్కడి బాక్స్ ఆఫీస్ ను షేకే చేశాయి. కానీ ఈ ఏడాది బాలీవుడ్ చిత్రాలేవీ మంచి ఓపెనింగ్స్ లేదా ఫుల్ రన్ లో భారీ కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. ఇటీవల విడుదలైన ఎటాక్, షాహిద్ కపూర్ ‘జెర్సీ’తో బాలీవుడ్ కు వరుస డిజాస్టర్ల కాలం స్టార్ట్ అయ్యింది. ఇక రెండు పెద్ద చిత్రాలు “రన్‌వే 34”, “హీరోపంతి 2” ఈ శుక్రవారం విడుదలయ్యాయి. కానీ చాలా తక్కువ ఓపెనింగ్స్ రాబట్టాయి. “రన్‌వే 34″కు మంచి స్పందన రాగా, వారాంతంలో థియేటర్లలో బాగా ఆడే ఛాన్స్ ఉంది. కానీ “హీరోపంతి 2” మాత్రం టైగర్ ష్రాఫ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.

Read Also : Mahesh Babu : ప్యారిస్‌ ట్రిప్… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆల్బమ్

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, విశ్లేషకులు ఇటీవల విడుదలైన బిగ్ మూవీస్ ఓపెనింగ్స్ చూసి షాక్ అవుతున్నారు. ఇది సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ చూడని డిజాస్టర్ ఈద్ అని ఒక టాప్ బాక్స్-ఆఫీస్ విశ్లేషకుడు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది సోషల్ మీడియాలో. ప్రస్తుతం బాలీవుడ్ బిగ్ మూవీస్ చూడడానికి అక్కడి ప్రేక్షకులు సైతం ఇంటరెస్ట్ చూపించకపోవడానికి రీజన్ ఏంటా అని ఆలోచిస్తున్నారు.