మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, డిస్నీ సినిమాటిక్ యూనివర్స్, యూనివర్సల్ మాన్స్టర్స్, ది కాంజురింగ్ యూనివర్స్… వరల్డ్ మూవీ లవర్స్ కి బాగా తెలిసిన సినిమాటిక్ యూనివర్స్ లు ఇవి. వీటిలో ఎక్కడ నుంచి అయినా, ఏ సినిమాలోని ఒక క్యారెక్టర్ అయినా ఇంకో సినిమాలో కనిపిస్తుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ లో అందరూ సూపర్ హీరోలు కలిసి కనిపించారు కదా దాన్నే సినిమాటిక్ యూనివర్స్ అంటారు. హాలీవుడ్ ఆడియన్స్ కి ఎప్పటి నుంచో తెలిసిన ఈ సినిమాటిక్ యూనివర్స్ లు ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా పుట్టుకొస్తున్నాయి. టాలీవుడ్ నుంచి ‘హిట్ ఫ్రాంచైజ్’ని ఒక యూనివర్స్ లాగా క్రియేట్ చేసి అందులో చాలా మంది హీరోలని కలపాలి అనేది దర్శకుడు శైలేష్ కొలను ప్లాన్. ఇప్పటికే ‘హిట్ సీరీస్’ నుంచి రెండు సినిమాలు వచ్చాయి, మూడో సినిమాలో నాని హీరోగా నటిస్తున్నాడు. కోలీవుడ్ లో కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పుట్టుకొచ్చింది.
ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ డిమాండబుల్ యూనివర్స్ అయిన ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ‘విక్రమ్’ సినిమా వచ్చింది. వచ్చే పదేళ్లలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఖైదీ 2, విక్రమ్ 3, రోలెక్స్, దళపతి 67 లాంటి సినిమాలు రానున్నాయి. కమల్ హాసన్, విజయ్, సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్ హీరోలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కనిపించనున్నారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రశాంత్ నీల్ కూడా తన సినిమాటిక్ యూనివర్స్ లో సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. KGF నుంచి రాఖీ భాయ్ ని, సలార్ నుంచి ప్రభాస్ ని, ‘ఎన్టీఆర్ 31’ నుంచి ఎన్టీఆర్ ని కలిపి ఒక యూనివర్స్ ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చెయ్యబోతున్నాడు అనే న్యూస్ గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఇదే జరిగితే ‘ఇండియన్ జస్టీస్ లీగ్’ రేంజులో ఉండే ఒక సినిమాని ఇండియన్ ఆడియన్స్ చూస్తారు.
సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఈ సినిమాటిక్ యూనివర్స్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన రోహిత్ శెట్టి ‘కాప్ యూనివర్స్’ని స్టార్ట్ చేశాడు. సింగం సీరీస్ నుంచి అజయ్ దేవగన్ ని, సింబా సినిమా నుంచి రణవీర్ సింగ్ ని తెచ్చి అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవన్షీ’ సినిమాని తెరకెక్కించాడు రోహిత్ శెట్టి. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో రోహిత్ శెట్టి ‘కాప్ యూనివర్స్’ని మరింత ఎక్స్పాండ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఇదే దారిలో ఒక ‘స్పై సినిమా యూనివర్స్’ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు యష్ రాజ్ ఫిల్మ్స్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారి సినిమాలని నిర్మించే కెపాసిటీ ఉన్న అతి తక్కువ బ్యానర్స్ లో ఒకటైన యష్ రాజ్ ఫిల్మ్స్… రీసెంట్ గా ‘స్పై’ సినిమాలని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2012లో సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ లతో యష్ రాజ్ ఫిల్మ్స్ ‘ఎక్ థా టైగర్’ సినిమా చేశారు. ఆ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ బయటకి వచ్చింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లతో ‘వార్’ అనే సినిమా చేసి మరోసారి సాలిడ్ హిట్ కొట్టిన యష్ రాజ్ ఫిల్మ్స్… తాజాగా ఒకేసారి రెండు స్పై సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో ఒకటి ‘ఎక్ థా టైగర్ సిరీస్’లోని మూడో పార్ట్ ‘టైగర్ 3’ కాగా మరొకటి షారుఖ్ ఖాన్ తో చేస్తున్న ‘పఠాన్’. బాలీవుడ్ కి సేవియర్స్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో ఒక స్పెషాలిటీ ఉంది. సల్మాన్ నటిస్తున్న టైగర్ 3లో షారుఖ్ ‘పఠాన్’గా క్యామియో ప్లే చేస్తుంటే, షారుఖ్ హీరోగా నటిస్తున్న ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ‘టైగర్’గా క్యామియో ప్లే చేస్తున్నాడు. సల్మాన్, షారుఖ్ సినిమాల మధ్య క్రాస్ ఓవర్ జరుగుతుంది కాబట్టి యష్ రాజ్ ఫిల్మ్స్ తమ యూనివర్స్ లో మరింత పెంచడానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకూ తమ బ్యానర్ లో వచ్చిన క్యారెక్టర్స్ ని ఈ స్పై యూనివర్స్ లో భాగంగా చేసి, ఫ్యూచర్ లో రాబోయే సినిమాలని కూడా స్పై యూనివర్స్ లోకి తీసుకోని వస్తున్నాం అంటూ యష్ రాజ్ ఫిల్మ్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. బాలీవుడ్ లోనే కాదు ఇప్పటివరకూ ఇండియా లోనే ఇలాంటి ఒక యూనివర్స్ క్రియేట్ అయ్యిందే లేదు.
షారుఖ్, సల్మాన్, కత్రీనా, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, తాప్సీ, అలియా భట్ లాంటి వాళ్లు బాలీవుడ్ లో మంచి స్పై థ్రిల్లర్ సినిమాలు చేశారు. తెలుగు నుంచి అడివి శేష్ ప్రస్తుతం ‘స్పై’గా ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమాలు చేస్తే ఇండియన్ సినిమా మొత్తం ఒక గొడుగు కిందకి వచ్చి ఆగినట్లు ఉంటుంది. అప్పుడు రీజనల్ సినిమా అనే పేరు వినిపించకుండా దాదాపు అన్ని చిత్రాలు ఇండియన్ సినిమలుగానే రిలీజ్ అవుతాయి, వరల్డ్ సినిమాలో మన మార్కెట్ మరింత పెరుగుతుంది. ‘పఠాన్’ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో యష్ రాజ్ ఫిల్మ్ ఈ స్పై యూనివర్స్ గురించి అనౌన్స్ చేసింది కాబట్టి మరి ‘పఠాన్’ సినిమాలో షారుఖ్, సల్మాన్ ఖాన్ లు మాత్రమే కాకుండా ఇంకెవరైనా హీరోలు కనిపిస్తారేమో చూడాలి.