Site icon NTV Telugu

Bollywood : యష్ కి జోడీగా కాజల్..

Black And White Trendy Gaming Youtube Banner (1)

Black And White Trendy Gaming Youtube Banner (1)

బాలీవుడ్ నుండి తెరకెక్కుతున్నా బారీ పాన్ ఇండియా చిత్రాలో `రామాయ‌ణ`ఒకటి. దర్శకుడు నితేష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ భార‌తీయ ఇతిహాసం రామాయ‌ణానికి స్టోరీ స్క్రీన్‌ప్లే న‌మిత్‌మ‌ల్హోత్రా అందిస్తుండ‌గా, స్టోరీని మాత్రం శ్రీ‌ధ‌ర్ రాఘ‌వ‌న్ అందిస్తున్నారు. ర‌ణ్‌బీర్ క‌పూర్‌, సాయి ప‌ల్లవి సీతారాములుగా న‌టిస్తున్న ఈ మూవీని న‌మిత్‌మ‌ల్హోత్రా, హీరో య‌ష్ నిర్మిస్తున్నారు.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాని ఏమాత్రం తీసిపోని స్థాయిలో అత్యాధునిక సాంకేతిక‌త‌తో తెర‌కెక్కిస్తున్నారు. కాగా దీని మొద‌టి భాగాన్ని 2026 దీపావ‌ళికి విడుద‌ల చేయ‌నుండ‌గా, రెండ‌వ భాగాన్ని 2027 దీపావ‌ళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. అయితే ఇందులో నటినటుల గురించి రోజుకో వార్త వైరల్ అవుతుండగా, ఇప్పటికే రావ‌ణుడిగా య‌ష్ న‌టిస్తుండ‌గా, హ‌ను మంతుడిగా స‌న్నీ డియోల్, సూర్పనకగా రకుల్ ప్రీతి సింగ్ క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం రాకెట్ స్పీడుతో ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక తాజాగా  క్రేజీ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఈ మూవీలో భాగం అయిన‌ట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో య‌ష్ రావ‌ణాసుడిగా న‌టిస్తుండ‌గా అత‌నికి జోడీగా రావ‌ణుడి స‌తీమ‌ణి పాత్రలో మండోద‌రిగా కాజ‌ల్ క‌నిపించ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version