Site icon NTV Telugu

Bollywood: హిందీ ఖైదీ టీజర్ వచ్చేది ఆరోజే…

Bholaa

Bholaa

తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిన మూవీ ‘ఖైదీ’. ఒకరోజు రాత్రి జరిగే కథతో రూపొందిన ఈ మూవీ లోకేష్ కనగరాజ్ లాంటి యంగ్ టాలెంట్ ని అందరికీ పరిచయం చేసింది. దళపతి విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాతో బాక్సాఫీస్ క్లాష్ లో పోరాడి గెలిచిన ఖైదీ మూవీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఈ మూవీలో కార్తీ చేసిన యాక్టింగ్ కి, నైట్ ఎఫెక్ట్ లో కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. ఒక యాక్షన్ ఎక్స్ట్రావెంజా లాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఖైదీ మూవీని హిందీలో అజయ్ దేవగన్ ‘భోలా’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నాడు. సొంత దర్శకత్వంలో అజయ్ దేవగన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ భారి నార్త్ లో భారి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిన్న గ్లిమ్ప్స్ తో అజయ్ దేవగన్ సాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేశాడు. మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానున్న భోలా సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.

జనవరి 24న భోలా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు అజయ్ దేవగన్ అండ్ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. టబు స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న భోలా సినిమాని అజయ్ దేవగన్ 3Dలో రూపొందిస్తున్నాడు. ఒక హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా జోనర్ లో తెరకెక్కిన సినిమాని అజయ్ దేవగన్ 3Dలో ఎందుకు రూపొందిస్తున్నాడు అనే ప్రశ్నకి సమాధానం మాత్రమే ఎవ్వరి దగ్గరా లేదు. కంటెంట్ వైజ్ చాలా స్ట్రాంగ్ ఉన్న ఖైదీ సినిమాని అలానే రీమేక్ చేసి హిట్ కొట్టకుండా అజయ్ దేవగన్ 3D అంటూ లేని పోనీ ప్రయోగాలు చేస్తున్నాడు అనే మాట సినీ అభిమానుల్లో ఉంది. మరి ఆ మాటని దాటి ఆడియన్స్ కి అజయ్ దేవగన్ ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడా లేక ఒక మంచి సినిమాని రీమేక్ చేసి చెడగోట్టాడు అనే చెడ్డ పేరుని సొంతం చేసుకుంటాడా? అనేది చూడాలి.

Exit mobile version