Site icon NTV Telugu

Ruchi Gujjar : హీరోను చెప్పుతో కొట్టిన హీరోయిన్..

Ruchi Gujjar

Ruchi Gujjar

Ruchi Gujjar : హీరోను ఓ హీరోయిన్ అందరి ముందే చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్, హీరో అయిన మాన్ సింగ్ ను హీరోయిన్ రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. మాన్ సింగ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ‘సో లాంగ్ వ్యాలీ’ అనే బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన జులై 25న ముంబైలోనిసినీపోలిస్ థియేటర్‌కు వచ్చారు. అతను వస్తున్నట్టు ముందే తెలుసుకున్న రుచి గుజ్జర్ అక్కడకు చేరుకుంది. ఆపై మాన్ సింగ్ ను చెప్పుతో కొట్టింది. ఈ క్రమంలోనే దాడిని ఆపేందుకు పక్కనే ఉన్న అతని సహాయకులు అడ్డుపడ్డారు. మాన్ సింగ్ మీద దాడి చేయకుండా గుజ్జర్ ను పక్కకు తీసుకెళ్లారు.

Read Also : Payal Rajput : పాయల్ అందాల సోయగాలు.. చూశారా..

తనకు మాన్ సింగ్ రూ.25 లక్షలు బాకీ ఉన్నాడని.. అందుకే దాడి చేసినట్టు రుచి గుజ్జర్‌ తెలిపింది. ఆ డబ్బులు ఇవ్వమంటే దాటవేస్తున్నాడంటూ ఆరోపించింది. ఈ డబ్బుల విషయంపై ఇప్పటికే గుజ్జర్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. మ్యూజిక్ ఆల్బమ్స్ కు సంబంధించిన తన రెమ్యునరేషన్ మాన్ సింగ్ ఇంకా ఇవ్వలేదని ఆమె ఆరోపిస్తోంది. రుచి గుజ్జర్ మొదట్లో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అప్పట్లో మాన్ సింగ్ నిర్మాతగా చేసిన కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో ఆమె నటించింది. వాటి తాలూకా డబ్బుల కోసం అతని చుట్టూ ఆమె తిరుగుతూనే ఉన్నట్టు చెబుతోంది.

Exit mobile version