Site icon NTV Telugu

Drugs Case: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోదరుడి అరెస్ట్.. కారణం ఇదే..!!

Siddhant Kapoor

Siddhant Kapoor

సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ కేసు కకావికలం చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్‌ను డ్రగ్స్ కేసు ఎంతో ఇబ్బంది పెట్టింది. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ వ్యవహారంలో అనేక తలనొప్పులను షారుఖ్ చవిచూశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఓ పార్టీలో సిద్ధాంత్ డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

క్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు పార్టీ నిర్వహిస్తున్న ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్‌ సేవించినట్లు అనుమానిస్తున్న వారి నమూనాలను పరీక్షలకు పంపారు. పాజిటివ్‌గా వచ్చిన ఆరుగురిలో సిద్ధాంత్ నమూనా కూడా ఉంది. అదుపులోకి తీసుకున్న ఆరుగురు వ్యక్తులు హోటల్‌లో డ్రగ్స్ సేవించారా లేదా పార్టీకి వచ్చే ముందు తీసుకున్నారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. సిద్ధాంత్ కపూర్ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించిన వారిలో నటి శ్రద్ధాకపూర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే శ్రద్ధాకపూర్‌‌కు వ్యతిరేకంగా ఆధారాలను పోలీసులు గుర్తించలేకపోయారు.

Exit mobile version