NTV Telugu Site icon

RRKPK: బాలీవుడ్ లిస్టులో మరో హిట్… మంచి రోజులు వస్తున్నాయి

Rrkpk

Rrkpk

కోవిడ్ ఎరాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేసింది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. షారుఖ్, సల్మాన్, ఆమిర్, అక్షయ్  లాంటి స్టార్ లు ఫ్లాప్స్ ఇవ్వడం… సుశాంత్ మరణం… వీక్ కథలు… కరోనా… నెపోటిజం… బాయ్ కాట్ బాలీవుడ్ లాంటి కారణాలతో బాలీవుడ్ విపరీతమైన డౌన్ ఫాల్ ని ఫేస్ చేసింది. ఇదే సమయంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ పై స్వైర విహారం చేసాయి. దీంతో బాలీవుడ్ గత 40-50 ఏళ్లలో ఎప్పుడూ లేనంత నెగటివ్ ట్రెండ్ ని చూసింది. ఇదే నెగటివ్ ట్రెండ్ లో రెండేళ్ల పాటు నెట్టుకొచ్చిన బాలీవుడ్, ఎట్టకేలకు రెక్కలు విదిలించడం మొదలుపెట్టింది. జనవరిలో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం బాలీవుడ్ మార్కెట్ ని బిగ్గెస్ట్ బూస్ట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి బాలీవుడ్ కోలుకోవడం మొదలయ్యింది. ఫిబ్రవరి నెలలో పెద్దగా సినిమాలు లేకపోయినా మార్చ్ లో రణబీర్ కపూర్ ‘తూ జూతి మే మక్కర్’ సినిమాతో హిట్ కొట్టాడు. ఏప్రిల్ సల్మాన్ ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ మూవీ లాంగ్ రన్ లో నిలబడలేదు కానీ ఓపెనింగ్స్ విషయంలో ట్రేడ్ కి మంచి జోష్ తెచ్చింది. మే నెలలో ది కేరళ స్టోరీ, IB 71 సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ది కేరళ స్టోరీ వివాదాలతో మొదలై సెన్సేషనల్ హిట్ అయితే  IB 71 స్లోగా స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అయ్యే వరకూ వెళ్ళింది.

జూన్ నెలలో బాలీవుడ్ కి మూడు హిట్స్ పడడం విశేషం. జర హట్కే జర బచ్కే, ఆదిపురుష్ (హిందీ), సత్యప్రేమ్ కి కథ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బాగా రాణించాయి. 1920 హారర్ సినిమా కూడా పర్వాలేదనిపించింది. ఓవరాల్ గా జూన్ నెలలో బాలీవుడ్ వారానికో హిట్ చూసింది. ఇప్పుడు జులై నెలలో మొదటి వారాలు హిట్ పడలేదు, దీంతో జూన్ మొమెంటమ్ కి జులై బ్రేక్ వేసిందని ట్రేడ్ వర్గాలు అనుకున్నారు. ఇలాంటి సమయంలో కరణ్ జోహార్ తను డైరెక్ట్ చేసిన ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. రణ్వీర్ సింగ్, అలియా భట్ లు నటించిన ఈ మూవీ మొదటి రోజే సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ప్యూర్ లవ్ స్టోరీ కథగా, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ప్యాక్ చేసి ఈ తెరకెక్కించిన ఈ సినిమా లాంగ్ రన్ ని మైంటైన్ చేస్తే చాలు బాలీవుడ్ లిస్టులో మరో మంచి హిట్ పడినట్లే.

Show comments