NTV Telugu Site icon

Swara Bhasker: రాజకీయ నాయకుడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న బాలీవుడ్ నటి

Swara Bhaskar

Swara Bhaskar

‘మధోలాల్ కీప్ వాకింగ్’ సినిమా ద్వారా 2009లో హీరోయిన్ గా  సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన స్వర భాస్కర్, ఇండియాస్ మోస్ట్ కాంట్రవర్షియల్ హీరోయిన్స్ లో ఒకరు. హీరోయిన్స్ అనే కాదు ఇండియాలోని మోస్ట్ కాంట్రవర్షియల్ సెలబ్రిటీస్ లో ఒకరు. నెటిజన్స్ సెలబ్రిటీస్ ని ట్రోల్ చెయ్యడం మాములే కానీ స్వర భాస్కర్ ని కరోనా వచ్చిన సమయంలో… ఆ కరోనాతో నువ్వు  చచ్చిపోతే బాగుంటుంది అనే రేంజులో స్వర భాస్కర్ ని ట్రోల్ చేశారు అంటే ఆమెపై ఉన్న ద్వేషం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు, రియా చక్రవర్తికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో స్వర భాస్కర్ పై మరిన్ని విమర్శలు వినిపించాయి. సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్ ని అయినా ప్లే చెయ్యగల టాలెంట్ ఉన్న అమ్మాయిగా పేరు తెచ్చుకుంటూనే స్వర భాస్కర్ సోషల్ గా సంఘంలో జరిగే వాటిపై కూడా గట్టిగానే మాట్లాడేది. ఈ కారణంగానే స్వర భాస్కర్ ని ట్రోల్ చేసే వాళ్లు చాలా ఎక్కువ. పైగా స్వర ANTI-CAA ప్రొటెస్ట్ లో పాల్గొని ట్రోల్ చేసే వాళ్లకి ఇంకా టార్గెట్ గా మారింది.

ఈ ప్రొటెస్ట్ ల సమయంలో స్వర భాస్కర్, సమాజ్ వాది పార్టీ యూత్ లీడర్ అయిన ‘ఫాహాద్ జిరార్ అహ్మద్’ని కలిసింది. పోరాటంలో పుట్టిన ప్రేమో లేక ఆ తర్వాత కలిసి చేసిన ప్రయాణం వలనో కానీ స్వర, ఫాహాద్ రిలేషన్ లోకి వెళ్లారు. ఈ ఇయర్ జనవరి 6న స్వర భాస్కర్, ఫాహాద్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. 2019 వరకూ స్వర ఇంకొకరితో రిలేషన్ లో ఉంది కానీ అది బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత స్వరకి ఫాహాద్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి Anti-CAA నిరసనలు చేశారు. ఎలాంటి హింట్ లేకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్న స్వర భాస్కర్, ట్విట్టర్ లో తన ప్రేమ జర్నీని ఒక వీడియోగా చేసి పోస్ట్ చేసింది. స్వర భాస్కర్ పెళ్లి విషయం తెలియగానే అందరూ షాక్ అవుతున్నారు.